Uddhav Thackeray does not own a car రూ.143 కోట్ల ఆస్తులు ఉన్నా కారు లేని ముఖ్యమంత్రి.!

Uddhav thackeray declared assets worth rs 143 crores does not own a car

Maharashtra MLC polls, Uddhav Thackeray, Maharashtra CM, Uddhav Thackeray assets, Thackeray assets worth Rs 125 crores, Uddhav Thackeray car, Uddhav Thackeray, Rashmi Thackeray, Shiv Sena, Election Commission, Worli, Mumbai, Chief Minister, Maharashtra, Politics

Maharashtra CM Uddhav Thackeray and his wife Rashmi Thackeray own assets worth Rs 125 crores. This was declared by Uddhav Thackeray in the affidavit he filed along with his nomination papers for the legislative council polls.

రూ.143 కోట్ల ఆస్తులు ఉన్నా కారు లేని ముఖ్యమంత్రి.!

Posted: 05/12/2020 04:17 PM IST
Uddhav thackeray declared assets worth rs 143 crores does not own a car

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారిగా ఎన్నికల బరిలో పోటీచేస్తునందున ఆయన తన ఆస్తులను ప్రకటించారు. శివసేన పార్టీ అధినేతగా కొనసాగుతున్నా.. ఆయన ఇప్పటి వరకు ఎన్నికల బరిలో దిగలేదు. ఈ సారి మూడు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయననే ముఖ్యమంత్రిగా అంగీకరించడంత ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యింది. దీంతో ఆయన మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. దీంతో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

ఉద్దవ్ థాకరే సహా ఆయన సతీమణి పేరున ఉణ్న మొత్తం రూ.143.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.76.56 కోట్లు ఆయన పేరుపై, రూ.52.44 కోట్లు సతీమణి రష్మీ ఠాక్రే పేరు మీద ఉన్నట్లు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పత్రాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి సొంత కారు లేదు. బ్యాంకు రుణాలతో కలిపి మొత్తం రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఆయనపై మొత్తం 23 కేసులు ఉన్నాయి. వీటిలో 14 కేసులు ఆయన శివసేన అధికారిక పత్రిక సామ్నాకు గీసిన కార్టూన్లు లేదా రాసిన వ్యాసాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నమోదైనవే.

ఉద్ధవ్‌ తన ఇద్దరు కుమారులు తనపై ఆధారపడుతున్నట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదు. దీంతో వారివురి ఆస్తులు, అప్పుల వివరాలు తెలపలేదు. సీఎంగా వేతనం, వడ్డీలు, డివిడెండ్లు, క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉద్ధవ్‌ తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. ఇక ఆయన భార్య రష్మీకి.. వడ్డీలు, అద్దె, కంపెనీ లాభాల్లో వాటా, డివిడెండ్‌, క్యాపిటల్‌ గెయిన్స్‌ నుంచి ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. ఇక ఆయన ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ వేశారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఉద్ధవ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికవడం లాంఛనమే అవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles