"Lockdown 4 To Be Different, With New Rules": PM Modi కొత్త రూపుతో లాక్ డౌన్-4.. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ

Coronavirus pm modi announces economic relief package worth rs 20 lakh

coronavirus live updates, pm modi, narendra modi speech, pm modi speech on lockdown, prime minister modi speech updates, narendra modi speech, Coronavirus India, COVID-19, Narendra Modi, India, Coronavirus, special package, Lockdown-4, Local products, Make in India, National Politics

PM Narendra Modi announced a special economic package and gave a clarion call for Atmanirbhar Bharat. PM Modi noted that this package, taken together with earlier announcements by the government during covid-19 crisis and decisions taken by RBI, is to the tune of Rs.20 lakh crore.

కొత్త రూపుతో లాక్ డౌన్-4.. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ: ప్రధాని

Posted: 05/12/2020 09:11 PM IST
Coronavirus pm modi announces economic relief package worth rs 20 lakh

కరోనా మహమ్మారిపై సుదీర్ఘ యుద్ధం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై పోరులో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా కల్పించేందుకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. కరోనాపై యుద్దం చేస్తూనే.. అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని జాతికి పిలుపునిచ్చారు. ఈ బాధ్యతను 130 కోట్ల మంది తలకెత్తుకోవాలని సూచించారు. కరోనాపై పోరాటంలో భాగంగా నాల్గవ విడత లాక్ డౌన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ లాక్ డౌన్ కొత్త రూపంలో ఉండనుందని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్-4లో కూడా అన్ని నియమాలు, జాగ్రత్తలు పాటిద్దామని తెలిపారు.

నాలుగో విడత లాక్ డౌన్ అంశాలను ఈనెల 18 లోపు ప్రకటిస్తామని ప్రధాని వెల్లడించారు. ఇక, కరోనా సంక్షోభంలో దేశీయ ఉత్పత్తిదారులే ఆధారమయ్యారని, డిమాండ్లకు తగిన విధంగా సరఫరాతో జాతి అవసరాలు తీర్చారని కొనియాడారు. భారత్ లో ఇకపై స్థానిక వస్తు వినియోగం పెరగాలని, మనవాళ్ల నుంచే వస్తువులు కొనుగోలు చేయాలని మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా ప్రాశస్త్యాన్ని మరోసారి నొక్కిచెప్పారు. భారతీయ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో కరోనా తరహా ఎలాంటి విప్తతులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోనవచ్చునని అన్నారు. ఈ నేపథ్యంలో ఖాదీ వస్త్రాల ప్రస్తావనను ప్రధాని ప్రస్తావించారు. ప్రజలందరూ ఖాదీ ఉత్పత్తులను వినియోగాన్ని పెంచాలన్నారు. స్థానిక వస్తువులకు ప్రజలే ప్రచారకర్తలుగా వ్యవహరించాలన్నారు.

గత 4 నెలులుగా కరోనాతో పోరాడుతున్నామని, యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం భారత్ దేనని, దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక తాజాగా ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు.

ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు. ఈ తరుణంలో దేశ ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని తెలిపారు. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు. ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచదేశాలు నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని  తెలిపారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh