స్టంట్ మాస్టార్ తనయుడిగా.. చిన్ననాటి నుంచి స్టంట్లు చూస్తూనే ఎదిగాడు.. బాలీవుడ్ హీరోగా తనదైన సాహసోపేత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో అజయ్ దేవగణ్. ఆయన సినిమాలో చేసిన స్టంట్ ను తాను చేయగలనని దేశవ్యాప్తంగా అనేకమంది అనుకరిస్తూ వుంటారు. అయితే ఇలా స్టంట్ల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు లేకపోలేరు. అప్పట్లో బాహుబలి చిత్రంలో స్టంట్ ను చేయబోయి పలువురు ప్రాణాలను కూడా కోల్పయిన విషయం తెలిసిందే.
అయితే ఇలా ఎవరైనా స్టంట్లు వగైరాలు చేస్తే వారిని అదుపులోకి తీసుకుని ఇలాంటివి తగదని చెప్పాల్సిన ఓ పోలీసు అధికారి తానే ఇలాంటి విన్యాసాలను చేస్తే.. అంతేకాదు తన విన్యాసంపై ప్రశంసలను ఆశిస్తే.. అవి దక్కక ఎక్కడికిపోతాయి. ఇక ఓ పోలీసు అధికారి విన్యాసాన్ని అటు మంచిగానూ, ఇటు మరోకోణంలోనూ చూసేవారి సంఖ్య కూడా పెరగడంతో ఆయన వీడియో కాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఆయన ఉన్నతాధికారుల దృష్టికి కూడా వీడియో వెళ్లింది. దానిని చూసిన వారు ఆయనకు ప్రశంసలకు బదులు ఫైన్ వేశారు. అంతేకాదు మరోసారి ఇలాంటి స్టంట్లు పునరావృతం కానీయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఎందకంటారా..? పోలీసు దుస్తులు ధరించి రెండు కార్లపై నిల్చొనే స్టంట్ చేసిన అధికారి వీడియో వైరల్ కావడంతో విచారణ జరపిన ఉన్నతాధికారులు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలోని నార్సింగ్ గర్హ ఎస్సై మనోజ్ యాదవ్ అజయ్ దేవగణ్ సింగం చిత్రంలోని రెండు కార్లపై వెళ్లే స్టంట్ ను అనుకరించాడు. పోలీసు దుస్తుల్లో ఇలా చేస్తూ వీడియో చిత్రీకరించుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది, దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఎస్సై మనోజ్ యాదవ్ కు రూ.5 వేల జరిమానా వేశారు. ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని హెచ్చరించారు. అలాంటివి ప్రమాదకరమని, యువతపై ప్రభావం చూపుతాయని మందలించారు.
जांच के बाद मामले में पुलिस अधीक्षक दमोह हेमंत चौहान ने की कार्रवाई, चौकी प्रभारी को किया लाइन अटैच, 5000 रुपये का जुर्माना भी लगाया ... सुबह से हुआ था मनोज यादव का वीडियो वायरल @ndtvindia pic.twitter.com/4ppaeKuT87
— Anurag Dwary (@Anurag_Dwary) May 11, 2020
(And get your daily news straight to your inbox)
Feb 24 | పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు... Read more
Feb 24 | పుదుచ్చేరిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై... Read more
Feb 24 | కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం... Read more
Feb 24 | మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు... Read more
Feb 24 | కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన... Read more