Stranded Migrants, Students, Tourists Can Go Home లాక్ డౌన్ నేపథ్యంలో మరోమారు కేంద్రం తాజా మార్గదర్శకాలు

Lockdown government new guidelines on stranded students tourists migrant labour

coronavirus, lockdown, Migrants, Tourinsts, coronavirus lockdown, Stranded, labourers, Students, Government Guidelines

The Ministry of Health Affairs (MHA) on Wednesday allowed the interstate movement of migrant workers, stranded pilgrims, and students subject to consultations between the sender and receiving states and adherence to health/safety protocols.

లాక్ డౌన్ నేపథ్యంలో మరోమారు కేంద్రం తాజా మార్గదర్శకాలు

Posted: 04/29/2020 08:04 PM IST
Lockdown government new guidelines on stranded students tourists migrant labour

లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాలకు వలసపోయి కూలీ పనులు చేస్తూ అక్కడే చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు.. కరోనా వైరస్ లక్షణాలు లేకుంటే తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవచ్చని కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ విధించిన దాదాపు 5వారాల తర్వాత కాసింత ఊరటనిస్తూ సడలింపులు చేయడంతో వారికి ఊపిరి పోసినట్లు అయ్యింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తెలుపుతూ కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

కోవిడ్ 19 లక్షణాలు లేని వలసకార్మికులను ఇంటికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ అంశంపై స్పందించాలని కేంద్రాన్ని కోరిన ఒక రోజు తర్వాత కేంద్రం తాజా మార్గదర్శకత్వాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా లక్షణాలు లేని వ్యక్తుల తరలింపును చేపట్టవచ్చని హోంశాఖ రాష్ట్రాలకు తెలిపింది. తరలింపు ప్రక్రియలో రెండు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు నోడల్‌ అధికారులను నియమించుకోవాలని సూచించింది.

కాగా, వలసకార్మికులు తరలివెళ్లే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సులను సైతం శానిటైజ్‌ చేసి నిబంధనలు పాటించాలని హోంశాఖ తెలిపింది.  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలపై ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. హర్యానాలో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసకార్మికులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత వారం ఉత్తరప్రదేశ్‌కు అనుమతి ఇచ్చిన తరువాత,బీహార్,జార్ఖండ్ వంటి రాష్ట్రాలు దీన్ని తప్పుబట్టాయి. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కిందకే ఇది వస్తుందని అన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles