Burglars break into Karachi Bakery కరాచీ బేకరీలో రూ. 10 లక్షల చోరీ..

Hyderabad major theft at karachi bakery 10l cash stolen

burglars, cameras, karachi bakery, mj market junction, Rs !0 Lakh theft, buglers, locker, begum bazar police, Hyderabad police, surveillance, telangana, Crimecorona virus deaths, coronavirus, coronavirus in india, coronavirus latest updates, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, covid updates, covid-19, telangana, Crime

Burglars broke into the popular Karachi Bakery at MJ Market junction and reportedly decamped with Rs 10 lakh from the cash counter. Police said the incident came to light when the management saw the burglars inside the shop through surveillance cameras.

కరాచీ బేకరీలో చోరీ.. లాకర్ పగులగొట్టి రూ.10లక్షలతో ఉడాయింపు..

Posted: 04/29/2020 09:00 PM IST
Hyderabad major theft at karachi bakery 10l cash stolen

సందట్టో సడేమియా అనే దొంగల గురించి విన్నాం.. సడీసప్పుడు లేకుండా సర్ధుకుపోయే దొంగల్నీ చూశాం. కానీ లాక్ డౌన్ వేళ నిషీధి రాత్రిలో తాళలు పగులగొట్టి ఏకంగా లాకర్ కే ఎసరు పెట్టిన దొంగలు నిన్న ప్రఖ్యాతి చెందిన దుకాణంలో పడ్డారు. ప్ర‌ముఖ క‌రాచీ బేక‌రీని లూటీ చేశారు. బేక‌రీలో చోర‌బ‌డ్డ దొంగ‌లు లాకర్ ను పగులగొట్టి అందులోని పది లక్షల రూపాయల నగదుతో ఊడాయించారు. అయితే ఈ ఘటన పోలీస్ చెక్ పోస్ట్కు కూతవేటు దూరంలోనే జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

లాక్ డౌన్ వేళ అహర్నిశలు శ్రమిస్తున్న పాలీసులు.. రాత్రి సమయంలో కాసింత సేద తీరిడంతో.. దోంగలు తమకు అడ్డు లేరని యధేశ్చగా పనిని కానిచేశారు. దొంగతనం స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలోని ఓ భవనంలో కరాచీ బేకరీ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా పోలీసుల ఆంక్షలకు అనుగుణంగా అప్పుడప్పుడూ మాత్రమే ఈ బేకరీని తెరుస్తున్నారు. అయితే బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యజమానులు లాకర్‌ పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు.

అందులో ఉండాల్సిన రూ.10లక్షల నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. భవనం మధ్యనున్న చిన్న సందు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని వెనుకే పోలీస్ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ దొంగలు ఇంత ధైర్యంగా ఎలా వచ్చారనే దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా, జ‌రిగిన దొంగ‌త‌నం తెలిసిన వారి ప‌నేనా అన్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles