Serum Institute aims to jump-start covid-19 vaccine హ్యూమన్ ట్రయల్స్ దశలో కరోనా వాక్సిన్.. అక్టోబర్ నాటికి రెడ్డీ..

Serum institute aims to jump start covid 19 vaccine production in may

virus, vaccine, Zydus Cadila, Coronavirus, Covid-19, Serum Institute, Coronavirus vaccine, Covid-19 vaccine, latest news on Covid-19 vaccine, corona news

Serum Institute of India, which is partnering Oxford University for a promising under-trial covid-19 vaccine, aims to have the vials ready for use by September-October, its chief executive said on Wednesday as scientists in the US reported success with the Oxford vaccine in animals.

హ్యూమన్ ట్రయల్స్ దశలో కరోనా వాక్సిన్.. అక్టోబర్ నాటికి రెడీ..

Posted: 04/29/2020 05:57 PM IST
Serum institute aims to jump start covid 19 vaccine production in may

కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డన్ ఎత్తివేత తరువాత ఎలా ముందుకెళ్లాలన్న విషయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖ సినీనటులతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఇటు దేశంలోని వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్ లో క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వ్యాక్సిన్‌ సక్సెస్ అయితే వెంటనే భారతీయుల కోసం వ్యాక్సిన్ ఉత్పదతను సిద్దం చేస్తామని ప్రకటించింది.

దేశంలోని అందరికీ ఈ వ్యాక్సీన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరికొన్ని రోజుల ఆగాల్సి వుంటుందని చెప్పింది. ప్రస్తుతం 6కోట్ల డోస్‌లను ఈ సంవత్సరం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే జంతువుల్లో పరీక్షలు జరిపి.. విజయవంతమైన ఫలితాలు రాబట్టామని చెప్పారు. కాగా హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాల్సి వుందని అందుకు అనుమతులు కూడా కోరామని చెప్పారు. అయితే, ‘ChAdOx1 nCoV-19’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ విజయవంతం కాగానే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అధర్‌ పూనావాలా వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎంతోమంది అత్యున్నత స్థాయి నిపుణులు నిమగ్నమయ్యారని.. అందుకే వ్యాక్సిన్‌ తొందరలోనే వస్తుందని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు వ్యాక్సిన్లు ఫేజ్‌-1 క్లినికల్ ట్రయల్స్‌ దశకు చేరుకున్నట్లు అంచానా వేశారు. ఇక ఆక్స్ ఫర్డ్‌ యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని సిరం సీఈఓ అధర్‌ పూనావాలా తెలిపారు.

వ్యాక్సీన్ ఫలప్రదమైన ఫలితాలను ఇస్తుందని తెలిసిన తరువాత రానున్న సంవత్సర కాలంలోనే దాదాపు 40కోట్ల వ్యాక్సిన్‌ డోసులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని భారత్ లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు. ఒక్కో వ్యాక్సిన్‌ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. అయితే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకోసం కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్‌ కోసం రూ. 600కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈమధ్యే ఆమోదం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles