AP High Court serious on video cross talking during case hearing నిమ్మగడ్డ రమేష్ కేసుల విచారణ వాయిదా..

Ap high court serious on video cross talking adjuorns ramesh case to monday

AP High Court, Nimmagadda Ramesh Kumar, State Election Commissioner, Andhra Pradesh DGP, Telangana DGP, Court Hearing, social distancing

Andhra Pradesh High Court serious on video cross talking during case hearing, slams the court officials for leaking password to others. The Cheif Justice adjuorns former SEC Nimmagadda Ramesh case to monday on regular hearing.

ITEMVIDEOS: వీడియో విచారణలోకి 40 మంది న్యాయవాదులు.. హైకోర్టు సీరియస్

Posted: 04/29/2020 02:58 PM IST
Ap high court serious on video cross talking adjuorns ramesh case to monday

కరోనావైరస్ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ప్రమాణాలను పాటిస్తూ కేసు విచారణను చేపడుతున్న రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తాజాగా జరిగిన పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 10 మంది న్యాయవాదులకు మాత్రమే అనుమతి వున్న కేసు విచారణలో ఏకంగా 40 మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ విచారణలోకి ఎలా వచ్చారని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు, అదే సమయంలో ఓ వైపు విచారణ జరుగుతున్నా న్యాయవాదుల క్రాస్ టాక్ తో అవాంతరం ఏర్పడటం పట్ల తీవ్రంగా మండిపడ్డారు.

దీంతో ఇవాళ విచారణ పూర్తి అవుతుందని భావించిన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేసును న్యాయస్థానం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం నుంచి నేరుగా హైకోర్టులోనే విచారణ ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. విచారణకు హాజరయ్యే న్యాయవాదులందరికీ.. పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఇతరులు రావడంపై మండిపడ్డారు. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. పాస్‌వర్డ్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే.. క్రాస్‌టాక్‌ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి హైకోర్టులోనే విచారణ ఉంటుందని.. భౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన న్యాయవాదుల్నే అనుమతిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles