pregnant woman dies after late delivery వైద్యుల నిర్లక్షమా.? లేక వైద్య సిబ్బంది అలసత్వమా.?

Cm kcr instructions on pregant woman turned down by medical staff

Telangana CM, KCR, Jenila, Pregnant woman, infant baby dead, gadwal district, Kurnool Hospital, Koti womens hospital, Gandhi Covid Hospital, mahaboobnagar, lockdown, coronavirus, covid-19, Telangana

Telangana Chief Minister Kalvakuntla Chandrashekar Rao during the lockdown said the government and district administration had accesed all the measures to be taken for the deliveries to be made on pregnant woman. But a pregnant women died because of late delivery in Gadwal district.

సీఎం చెబుతున్నదొకటి.. ఆచరణలో జరుగుతున్నది మరోకటి.. ఎందుకీ నిర్లక్ష్యం.?

Posted: 04/28/2020 11:42 AM IST
Cm kcr instructions on pregant woman turned down by medical staff

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని సంపూర్ణంగా కట్టడి చేయడంలో భాగంగా, ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ లాక్ డౌన్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ముందుచూపుతో రాష్ట్రంలో గర్ణిణీ మహిళల జాబితాను సేకరించి.. వారి డెలివరీ సమయాలను బట్టి చర్యలు సకాలం స్పందించి చర్యలు తీసుకోవడంలో జిల్లా సిబ్బందిలో పాటు వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా వుండాలని అదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఓ వైప్రు ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రంలోని వైద్యులందరూ వైద్య సేవలను అందిస్తున్న తరుణంలో.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించి ఓ నిండు గర్భిణీ అమెకు పుట్టిన పండంటి బిడ్డ ప్రాణాలను బలితీసుకుంది.  

కరోనా వైరస్ మహమ్మారి పేరుతో ఎలాంటి భయోత్సాప పరిణామాలు చోటుచేసుకోకూడతని, ఈ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేసినా.. మీడియా సహా సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే కరోనా జిల్లాకు చెందిన ఓ నిండు గర్బిణి, అమె బిడ్డ మరణించడానికి కూడా అదే కారణమైయ్యింది. మరి ఈ నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.? సీఎం కేసీఆర్ ఈ విషయమై ఎలా స్పందిస్తారు.? ఈ అలసత్వానికి, పూర్తి నిర్లక్ష్యానికి ఎవర్ని బాద్యుల్ని చేస్తారు.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి ఆరు ఆసుపత్రుల చుట్టూ.. ఏకంగా 200 కిలోమీటర్లు ఎందుకు తిరగాల్సి వచ్చిందో.. అందుకు కారణాలేంటో కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడంతో చికిత్స ఆలస్యమై పుట్టిన బిడ్డ.. అనంతరం తల్లి కూడా మృతిచెందారు. ఇలాంటి ఘటనలతో యావత్ వైద్య సిబ్బందికి అహర్నిశలు కష్టపడి చేస్తున్న సేవలకు అపఖ్యాతిని అపాదించిపెడుతున్నాయి. ప్రసవ వేధనతో ఆ తల్లి రెండు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి అవసరమెందుక వచ్చిందన్న దయనీయ ఉదంతానికి సంబంధించిన వివరాలు బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నె ప్రాంతానికి చెందిన జెనీలా(20సం.) నెలలు నిండటంతో కాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి ఈ నెల 24న వెళ్లింది. రక్తం తక్కువగా, బీపీ ఎక్కువగా ఉందంటూ కర్నూలు ఆసుపత్రికి వెళ్లాలని ఆమెకు సూచించారు. కరోనా కారణంగా కర్నూలుకు వెళ్లే పరిస్థితులు లేనందున కలెక్టరుకు సమాచారం ఇవ్వగా మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు 102 వాహనం సిద్ధం చేయించి పంపించారు. ఇక్కడికి వచ్చాక పరీక్షించిన వైద్యులు జెనీలా పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాన్పు కష్టమవుతుందని హైదరాబాదులోని కోఠి ఆసుపత్రికి తరలించారు.
 
కేంద్ర ప్రభుత్వం హాట్ స్పాట్‌గా ప్రకటించిన గద్వాల జిల్లా నుంచి వచ్చినందున కోఠి ఆసుపత్రి వైద్యులు జెనీలాను ముందుగా కరోనా పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. అక్కడ పరీక్షించి నెగిటివ్ గా తేల్చడంతో వెంటనే అమెను కోఠి అసుపత్రకి తీసుకెళ్లకుండా నేరుగా పేట్లబురుజు దవాఖానాకు తీసుకెళ్లారు. ఎందుకిలా చేశారు.? అమెకు కోఠి అసుపత్రిలో ఎందుకు ప్రసవం చేయలేదన్న వివరాలు తెలియాల్సి వుంది. కాగా, శనివారం అక్కడ కాన్పు నిర్వహించగా మగబిడ్డ పుట్టాడు. బాబుకు ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉండటంతో నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు పసివాడు కన్నుమూశాడు.

జెనీలా పరిస్థితి కూడా విషమించడంతో పేట్లబురుజు ఆసుపత్రి నుంచి ఆదివారం ఆమెను ఉస్మానియాకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8.30కు మృతిచెందినట్టు భర్త మహేందర్‌ ‘న్యూస్‌టుడే’కు ఫోనులో వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ అనుమానంతోనే వైద్యులు తమను ఇన్ని ఆసుపత్రులకు తిప్పారని, సకాలంలో కాన్పు చేసి ఉంటే తల్లీబిడ్డలు ఇద్దరూ దక్కేవారని వాపోయారు. అటు భార్య, ఇటు బిడ్డను పోగొట్టుకున్న తాను ఈ శోకాన్ని ఎలా భరించేదని, బతికుండి ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles