Scientists claim corona's genetic material found in air కోవిడ్ గాలి నుంచి వ్యాప్తి చెందుతుందా.? అధ్యయనాల్లో అవశేషాలు..

New study detects coronavirus genetic material in air but unclear if particles are infectious

coronavirus, Residuals, Genetic materail, covid-19, airborne, coronavirus-air, Wuhan University, SARS-CoV-2 RNA, journal Nature, china

Scientists have revealed evidence for the presence of the genetic material of the novel coronavirus in the air, but say that it is unclear if these suspended viral particles are infectious. By monitoring the environment around two hospitals and some public areas in Wuhan, China, researchers, including those from Wuhan University in China, revealed hotspots for airborne novel coronavirus RNA.

కోవిడ్ గాలి నుంచి వ్యాప్తి చెందుతుందా.? అధ్యయనాల్లో అవశేషాలు..

Posted: 04/28/2020 12:31 PM IST
New study detects coronavirus genetic material in air but unclear if particles are infectious

మానవాళి ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ పెను సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి నెలలు గడుస్తున్న కొద్దీ తన ఉధృతిని పెంచుకుంటూ తన రూపాన్ని మార్చకుంటూ.. లక్ష్యణాలను పెంచుకుంటూ ముప్పులా తయారవుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న అధ్యయనాలు మరో విషయాన్ని కూడా చెబుతున్నాయి. కరోనా పుట్టిన చైనాలోని వూహాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అథ్యయానాల్లో మరో విషయం బయటపడింది. కరోనా వైరస్‌ బారిన పడిన వారికి చికిత్స అందిస్తోన్న ఆసుపత్రుల పరిసరాల్లోని గాలిలోనూ కరోనా జన్యు అవశేషాలు ఉన్నట్లు తేల్చారు.

దీంతో గాలీ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..? అందుకనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారా.? మానవజాతి మనుగడకే సవాల్ విసిరేలా లక్షలాది మంది మరణిస్తున్నారా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే, గాలిలోని కొవిడ్‌-19 ఆర్‌ఎన్‌ఏ వల్ల ఇతరులకి ఇన్ఫెక్షన్‌ సోకిన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని చెప్పారు. చైనాలో కరోనా విజృంభించి తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వూహాన్‌లో రెండు కరోనా ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో పరిశోధకులు  అధ్యయనం చేయగా ఈ కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నేచర్ రీసెర్చ్‌ జర్నల్‌లో పరిశోధకులు ఈ విషయాలను తెలిపారు.

తమ అధ్యయనంలో భాగంగా ఆ రెండు ఆసుపత్రుల చుట్టూ గాలిలోని నీటి తుంపరలను గుర్తించే ఎలక్ట్రిక్ ఏరోజల్ డిటెక్టర్లను పరిశోధకులు అమర్చారు. ఆయా ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 రోగులు వాడే శౌచాలయాలకు తగిన వెంటిలేషన్ లేకపోవడంతో అవి వైరస్‌తో కూడిన తుంపరలకు ఆవాసాలుగా మారాయని వూహాన్ పరిశోధకులు తమ అధ్యయన నివేదికలో తెలిపారు. దీంతో అక్కడి నుంచే ఈ తుంపరలను వాహకంగా వాడుకొన్న వైరస్ ఆర్ఎన్ఏ ఆ ఆసుపత్రుల పరిసరాల్లోలోకి ప్రవేశించిందని చెప్పారు.

అంతేకాదు, కరోనా రోగులకు చికిత్స చేసిన తర్వాత ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక గదుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లను విప్పేసే సమయంలో గాల్లోకి కరోనా వైరస్‌తో కూడిన తుంపరలు బయటకు వచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ పరిస్థితిని సమర్థవంతమైన శానిటైజేషన్‌తో అరికట్టవచ్చని తెలిపారు. కరోనా రోగులు వాడే శౌచాలయాలకు వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించారు. వైరస్ ప్రభావిత హాట్ స్పాట్లలోనూ ఇలాంటి జాగ్రత్త చర్యలు అత్యవసరమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles