MetroMedi: One-Stop Solution For All The Healthcare Needs మెట్రోమెడి ఫార్మసీలు ఇకపై సంపూర్ణ అరోగ్య కేంద్రాలు..

Metromedi one stop solution for all the healthcare needs

MetroMedi, with its plans to be a one-stop, omnichannel pharmacy and health store solutions provider, is a good example. Maruthi Medisetti, CEO, MetroMedi shares more details about how this venture aims to address gaps in last-mile healthcare services

MetroMedi, with its plans to be a one-stop, omnichannel pharmacy and health store solutions provider, is a good example. Maruthi Medisetti, CEO, MetroMedi shares more details about how this venture aims to address gaps in last-mile healthcare services

మెట్రోమెడి ఫార్మసీలు ఇకపై సంపూర్ణ అరోగ్య కేంద్రాలు..

Posted: 04/24/2020 10:49 PM IST
Metromedi one stop solution for all the healthcare needs

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రభావాన్ని చాటుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాపారాలు ఇన్నాళ్లు కొనసాగించిన సాంప్రదాయ పద్దతులను వీడి సాంప్రదాయేతర బాట పట్టాల్సివస్తోంది. ఈ క్రమంలో వ్యాపారం మరియు కార్యాచరణ నమూనాలను పెద్ద, విలువ-ఆధారిత పాత్రలను పోషించడానికి చాలామంది అనుసరిస్తున్నందున ఫార్మసీలు దీనికి మినహాయింపు కాదు. కోవిడ్-19 శరవేగ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కరోనా కాకుండా ఇతర వ్యాధులు, లేదా అరోగ్య సమస్యలు తలెత్తిన పక్షంలో వారు ఇళ్ల నుంచి బయటకు కదిలే అవకాశాలు లేవు. దీంతో ఇంట్లో వుంటూ బాధను కూడా భరించలేరు.

ఇలాంటి తరుణంలో తాము బాధితుల అరోగ్య సమస్యలకు యాప్ ద్వారా పరిష్కారం చూపుతామని అంటోంది మెట్రోమెడి. మెట్రోమెడి అన్ లైన్ ఫార్మ సంస్థ ఓమ్నిచానెల్ ఫార్మసీ మరియు హెల్త్ స్టోర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కావాలనే ప్రణాళికలతో ముందుకు కదులుతోంది. మెట్రోమెడీ సిఇఒ మారుతి మెడిసెట్టి ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు తృతీయ శ్రేణి నగరాలలో తమ వన్ స్టాప్ సోల్యూషన్స్ తో పాటు ఫార్మా సేవలను అందించాలని పూనుకున్నారు. చివరి-మైలు ఆరోగ్య సేవల్లోని అంతరాలను పరిష్కరించడానికి ఈ వెంచర్ ఎలా లక్ష్యంగా పెట్టుకుందనే దాని గురించి మరిన్ని వివరాలనుఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఓమ్నిచానెల్ ఫార్మసీ మరియు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ స్టార్టప్ సంస్థ కావడంతో, తాము ఒక సాధారణ నమూనాను నిర్మించి.. దాని అనుగూణంగా ముందస్తుగా ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు తమ అరోగ్య సేవలతో పాటు ఫార్మా సేవలను కూడా అందించాలని నిర్ణయించుకున్నామని మారుతి మెడిసెట్టి తెలిపారు. ఈ నగరాల్లోని రోగులు టెక్నాలజీ పరంగా అందుబాటులోకి వచ్చే తమ వైద్య సేవలను వినియోగించుకుని సంతోషంగా బాధా విముక్తులు కావచ్చునన్నారు. తమ సాంకేతిక పరాక్రమం బ్యాక్ ఎండ్‌లో ఉందన్న ఆయన ఇక ఈ నగరాల్లో నిర్ణీత సమయంలోగా ఔషధాల అర్డర్ ను కూడా అందించేందుకు బ్యాక్ ఎండ్ టీమ్ సన్నధంగా వుందని అన్నారు.

మెట్రోమెడి ఎలా పనిచేస్తోంది..?

మెట్రోసిటీ పనిచేసే విధానం చాలా సులభమైందని మారుతి మెడిసెట్టి తెలిపారు. రోగులు తమ ప్రిస్క్రిప్షన్లను వాట్సాప్ ద్వారా పంచుకుంటారు మరియు మా సిబ్బంది ఆ మందులను క్రమం తప్పకుండా వారికి అందిస్తారు. వినియోగదారులకు మెట్రోల మాదిరిగా బహుళ ఎంపిక అవకాశాలు లేని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో చివరి-మైలు ఆరోగ్య సేవలు అందించాలని.. మెట్రో నగరాలతో ఈ నగరాలకున్న అంతరాన్ని పరిష్కరించడం తమ ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. ఈ నగరాల్లో ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుతి తెలిపారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తమ ఓమ్నిచానెల్ హెల్త్ స్టోర్ వ్యాపారాన్ని నిర్మించాలని భావిస్తున్నామన్నారు, ఇందుకోసం ప్రతీ నగరంలో తమ మెట్రో మెడీ హెల్త్ స్టోర్ ప్రారంభించనున్నామని చెప్పారు. ఇక ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా ఈ నగరాల్లోని ప్రజలకు పరిచయం వుండటంతో తమ దుకాణాల ఏర్పాటుకు పెద్ద సమయం కూడా పట్టదని మారుతి అశాభావం వ్యక్తం చేశారు. ఇలా తెరుచుకున్న తమ దుకాణాలలో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు తమ పట్ల విధేయతను పెంపొందించడంతో పాటు తమ పట్ల మరింత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తామని అన్నారు,

వీటితో పాటు కస్టమర్లకు తమ ద్వారా జరిగే ఇతర అరోగ్య సేవలను కూడా వివరించనున్నట్లు చెప్పారు. నాణ్యత కలిగిన ఔషదాలతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని వారికి వివరిస్తామన్నారు. డయాగ్నస్టిక్స్ అందించడానికి సంస్థ ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ మరియు డాక్టర్ సి లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అన్ని ఆరోగ్య అవసరాలకు ఒకే-పరిష్కారంగా మారడమే మెట్రోమెడీ లక్ష్యంగా మారుతి మెడిసెట్టి పేర్కోన్నారు.

మెట్రో మెడీ డాక్టర్ మొబైల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తోందంటే..

ద్వీతీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని రోగులకు వైద్యుల సంప్రదింపులను అందించే లక్ష్యంతో 2020 ఏప్రిల్ 25 న తాము మెట్రోమెడి డాక్ యాప్ ను రూపోందిచామని మారుతి చెప్పారు. భారతదేశంలోని పలు తృతీయ శ్రేణి, ఆపై చిన్న పట్టాల ప్రజలు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ను సంప్రదించాలంటే.. కనీసం 60 కి.మీ ప్రయాణించాల్సి వుంటుందని.. ఇక ఈ నగరాల్లో పనిచేస్తున్న వారి ఆర్థిక స్తోమత కూడా అంత మెరుగ్గా ఏమీ వుండదని.. ఈ ప్రాంతాల్లో రోజువారీ వేతనాలపైనే అధిక మంది పనిచేస్తుంటారని వారికి స్పెషలిస్టు డాక్టర్ తో సంప్రదించాలంటే ఒక సవాలుగా మారుతుందని చెప్పారు. రోజువారి వేతనాన్ని కోల్పోయేందుక సిద్దమైన తరువాతే వారు ఈ పనులు  చేయాల్సి వుంటుందని అన్నారు.

ఈ నగరాలు, పట్టణాలల్లో వున్న అరోగ్య కేంద్రాలు అనారోగ్యానికి, కేవలం ప్రాథమికంగానే చూస్తాయని చెప్పారు. ప్రతి రోగాన్ని కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తారు, యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం కూడా మరొక సమస్యకు దారితీస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అందుబాటులో మరియు సరసమైనదిగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ యాప్ ద్వారా అత్యంత తక్కువ ధరలో ఎలాంటి వేతనాన్ని ఇంట్లోని కుటుంబసభ్యులు కోల్పోకుండా మెరుగైన వైద్యం, నిపుణులైన వైద్యుల సూచనలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాతావరణం మరియు భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడం ఈ సేవను అత్యంత వేగంగా ప్రారంభించామని చెప్పారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కేసులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతున్నందున, ఇతర రోగాలతో బాధపడుతున్న రోగులు వ్యక్తిగతంగా వైద్యులను సందర్శించడానికి జంకుతున్నారని, ఇక కోందరు వైద్యులను సందర్శఇంచినా కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పారు. పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సమస్యలను టెలిమెడిసిన్ కూడా పరిష్కరించలేదని చెప్పారు.  

ఈ నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టాల ప్రజల కోసం మహానగరంలోని స్పెషలిస్టు వైద్యులను, ఉత్తమ వైద్యులను, అత్యుత్తమ వైద్యరంగ నిపుణులను ఫోన్ లేదా వీడియో ద్వారా సంప్రదింపుల కోసం వారు అయ్యే ఖర్చుతో సగం ఖర్చుతో అందుబాటులో ఉంచడం ద్వారా తాము ఈ పరిస్థితిని పరిష్కరించాలని అనుకుంటున్నామని మారుతి తెలిపారు. తమ యాప్ అభివృద్ధి చేయడానికి రెండు వారాలు తీసుకున్నాము మరియు దశల వారీగా దీనిని పలు నగరాల్లో ప్రారంభించామని తెలిపారు. ఈ వారం నుంచి కస్టమర్లకు తమ యాప్ అందుబాటులో వుంటుందని మారుతి మేడిసెట్టి తెలిపారు. రాబోయే రెండు వారాల్లో ప్రజలందరి అందుబాటులోకి ఈ మెట్రో మెడి డాక్ యాప్ ను అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పారు,

ఈ యాప్ ద్వారా ముఖ్యమైన మూడు వాటాదారులను-ఫార్మసీలు, వైద్యులు, రోగులను అనుసంధానించాలని ప్లాన్ చేస్తున్నాము, తద్వారా వైద్యుల సంప్రదింపుల నుండి ఔషధాల పంపిణీ వరకు ఎలాంటి అవాంతరాలు లేని ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ యాస్ ఉద్దేశ్యమని చెప్పారు. ఫార్మసీలు ఇటు వైద్యులకు అటు రోగులకు మధ్య నోడల్ పాయింట్‌గా పనిచేస్తాయని చెప్పారు. సున్నితమైన పనితీరు కోసం తాము నిత్యం యాప్ ను పర్యవేక్షిస్తామన్నారు. రోగులు ఎదుర్కొనే ఏలాంటి సవాళ్లలైనా తగ్గించడానికి ఈ విధానం చేపట్టామని చెప్పారు.

వైద్యుల నియామకంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు మాటేమిటీ..?

ప్రస్తుతం తమ యాప్ ద్వారా సేవలు అందించేందుకు యాభై మందికి పైగా వైద్యులను నియమించుకున్నామని మెట్రోమెడి సీఈఓ మారుతి మెడిసెట్టి తెలిపారు. ఇక మరికొందరు స్పెషలైజేషన్ వున్న వైద్యులు అన్ బొర్డింగ్ లో వున్నారని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా, పేరు, వయస్సు, చిరునామా, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, రిజిస్టర్డ్ ఐడి లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి సమాచారాన్ని సేకరించి వైద్యుడి గుర్తింపు మరియు ఆధారాలను ధృవీకరిస్తాము. తాము డాక్టర్ ఆధారాలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాము, తద్వారా రోగులకు డాక్టర్ నేపథ్యం మరియు అనుభవం గురించి తెలుసుకునే అవకాశం లభిస్తోందని అన్నారు. ఇక వైద్యుల సమాచారంతో పాటు అటు రోగుల అనుమతితో వారి సమాచారాన్ని కూడా సేకరిస్తామని అన్నారు.

టెలిమెడిసిన్ అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో దోహదపడుతుందని అన్న మారుతి.. హెల్త్ వర్కర్లకు, రోగులకు ఎలాంటి వ్యాధి సోకకుండా నివారించగలదని చెప్పారు. ఇక దీంతో పాటు అనవసర ఎక్స్ ఫఓజర్ ను కూడా నివారిస్తోందన్నారు. ప్రస్తుతం ఆన్-బోర్డింగ్ వైద్య నిపుణులు కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నావారినే నియమించుకున్నామని చప్పారు. ఈ నిపుణులైన వైద్యులు ఈఎన్ టీ,  జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ ఆప్తాల్మాలజీ మరియు సైకియాట్రీ వంటి బహుళ ప్రత్యేకతలకు చెందినవారని మారుతి విశ్లేషించారు.

లాక్ డౌన్ లో మెట్రోమెడీ ఫార్మా ఎలా పనిచేస్తోంది.?

అవసరమైన వస్తువులు, సేవల మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ లోని తమ మెట్రోమెడీ ఔషధ దుకాణాలు పనిచేస్తున్నాయని చెప్పారు మారుతి. తమ అంతర్గత సిబ్బందికి ముసుగులు, గ్లావ్స్, శానిటైజర్లు అందించామని చెప్పారు. తమ డెలివరీ సిబ్బందికి కూడా రక్షణ పరికరాలను అందించామని చెప్పారు. తాము స్టోర్లలోకి కస్లమర్లయినా, డెలివరీ ఎగ్జీక్యూటివ్స్ అయినా తప్పక మాస్కులతోనే ఎంటర్ కావాలని నిబంధన పెట్టామని చెప్పారు. అలా కానీ పక్షంలో కస్టమర్ల నుంచి తమ సిబ్బంది ప్రిస్క్రిప్షన్‌ను తీసుకుని ప్యాకేజీని అప్పగిస్తారని చెప్పారు. ప్రారంభ మరియు ముగింపు సమయాల్లో తాము ప్రాంగణాన్ని శుభ్రపర్చడంతో పాటు సిబ్బంది ఉష్ణోగ్రత తనిఖీలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.

రోజువారి వేతన జీవులకు మెట్రోమెడీ డాక్ యాప్ ఎలా చేరువవుతోంది.?

రోజువారి వేతన జీవులతో పాటు ద్వీతీయ, తృతీయ శ్రణి నగరాల్లోని పేదలకు, మధ్యవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు తమ మెట్రోమెడీ డాక్ యాప్ ప్రాంతీయ బాషలలో ప్రారంభిస్తున్నామని చెప్పారు సీఈఓ మారుతి మెడిసెట్టి. ఇక రెండవది.. తమ యాప్ ద్వారా సేవలు అందించే వైద్యులు కూడా వీడియో కాన్ఫరెన్స్ తో పాటు టెలీ కాన్ఫరెస్సులలో ప్రాంతీయ బాషలలోనే మాట్లాడతారని చెప్పారు. ఇలా తాము విద్యావంతుల నుంచి నిరక్షరాస్య పేషంట్ల వరకు అన్ని రకాల కస్లమర్లను అవసరమైన సేవలను అందించనున్నామని చెప్పారు,

టిక్‌టాక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జనాభాకు మెరుగైన రీతిలో ఉన్న కొంతమంది ప్రముఖులతో భాగస్వామ్యం ద్వారా దీన్ని ప్రారంభించాలని తాము యోచిస్తున్నట్లు మారుతి తెలిపారు. ఇక రోజువారి వేతన జీవులు వైద్యం కోసం ఖర్చులో అతితక్కువ ఖర్చుతోనే తాము తమ యాప్ ద్వారా వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఇక తమ మెట్రో మెడీ డాక్ యాప్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ద్వీతీయ, తృతీయ నగరాల ప్రజలకు పలు డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సమాజానికి తమ యాప్ ద్వారా వైద్యసేవలను అందిస్తున్నామని చెప్పారు.

నకిలీ మందుల సవాలుతో మీరు ఎలా పోరాడుతారు?

రీటైల్ ఫార్మసీలో తమకున్న పదేళ్ల సుదీర్ఘ అనుభవంతో తాము పనిచేస్తున్న ప్రతీ నగరంలో మొదటి మూడు పంఫిణీదారులతో మంచి సంబంధాలను ఏర్పర్చుకున్నామని మారుతి చెప్పారు. ఇక వారంతా కూడా తామ విశ్వసనీయ భాగస్వాములనేనని తెలిపారు. వారితో కలిసి పని చేస్తూ.. నాణ్యతా లోపభూయిష్టమైన వాటికి దూరం పాటిస్తూంటామని చెప్పారు. తమ కస్టమర్లకు నాణ్యతాయుతమైన ఔషదాలను అందించడానికే తాము నిత్యం శ్రమిస్తామని చెప్పారు. తమ సరఫరా గొలుసులో ఔషధ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బ్రాండ్ ఔషధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే వాటిని సరఫరా చేస్తామని మారుతి మెడిసెట్టి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh