India records 1,428 new Covid-19 cases, 57 deaths దేశంలో 24 గంటల్లో 57 కరోనా మరణాలు..

Coronavirus india records 1 428 new covid 19 cases 57 deaths in last 24 hours

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

There were 1,429 new cases of the coronavirus disease (Covid-19) and 57 deaths across the country in the last 24 hours, India’s tally of the coronavirus disease stands at 24,506—including 18,668 active cases, 5063 cured, discharged or migrated and 775 deaths, according to the health ministry’s dashboard at 8am.

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 57 మరణాలు

Posted: 04/25/2020 10:24 AM IST
Coronavirus india records 1 428 new covid 19 cases 57 deaths in last 24 hours

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అంతేకాదు కరోనా బారిన పడి అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరణాలు అందోళన కలిగించే స్థాయిలో నమోదయ్యాయి. అటు కేంద్రం అరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా మరణాలపై అందోళన చెందుతున్నాయి. ఈ మరణాలు దేశ ప్రజలను కూడా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలను కట్టడి కావడం లేదు  తాజాగా గడిచి, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 57 మరణాలు సంభవించడం కలవరానికి గురిచేస్తూనే ఉంది.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా పద్నాలుగు వందల 29 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 775కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 24 వేల మార్కుకు చేరిందని వెల్లడించింది. ఇవాళ్టి ఉదయానికి 24, 506 మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 5063 మంది కోలుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్యకూడా అధికంగానే వుందని తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 24,506కు చేరకుంది. గడిచిన 24 గంటల వ్యవధితో దేశవ్యాప్తంగా 1429 పాజిటివ్ కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 718 మంది మరణించగా తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 57 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య కూడా 700 దాటింది. పైరస్ మహమ్మారి మరణాల సంఖ్య 775కి చేరుకుంది. మొత్తం బాధితుల్లో 5093 మంది వ్యాది నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతం 19.89గా నమోదైయ్యిందని ప్రభుత్వం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles