Maha Minister test positive for COVID-19 కరోనా నియంత్రణ పర్యవేక్షణ.. మంత్రికి పాజిటివ్

Maharashtra minister jitendra awhad tests positive for covid 19

Maharashtra housing minister, Jitendra Awhad, coronavirus, covid_19, home quarantine, corona positive, mumbra-kalwa, NCP senior leader, fortis hospital, maharashtra polictics

Senior NCP leader and Maharashtra Housing Minister Jitendra Awhad has been tested positive for the Chinese epidemic coronavirus. According to the reports, the 54-year-old lawmaker had admitted himself a private hospital in Thane for a precautionary check-up. Earlier, Awhad was under home quarantine along with 15 members of his family for a week

కరోనా నియంత్రణ పర్యవేక్షణ.. ‘మహా’ మంత్రికి పాజిటివ్

Posted: 04/24/2020 12:50 PM IST
Maharashtra minister jitendra awhad tests positive for covid 19

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. మానవజాతి మనుగడకే సవాల్ విసురుతోంది. కరోనా మహమ్మారి ధాటికి బ్రటిన్ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్ సన్ కూడా అసుపత్రి పాలయ్యారు. తాజాగా మన దేశంలోనూ అత్యధిక కేసులు నమోదైన మహరాష్ట్రలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతూ.. తన ప్రభావం ధాటికి ఇప్పటికే వందల మందిని బలి తీసుకుంది. ఇక తాజాగా మహారాష్ట్రకు చెందిన అమాత్యులకు కూడా కరోనా వైరస్ సోకిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో మంత్రివర్యులను అసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు తన బాధ్యతగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయన సంచరించారు. అయితే అనుమానాల నేపథ్యంలో ప్రతి పది, పక్షం రోజుల వ్యవధిలో ఆయన పరీక్షలు నిర్వహించుకుంటూనే వున్నారు. అయితే పది రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ మినిస్టర్‌ జితేంద్ర అవహద్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ వలన మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ ఆరంభంలో లాక్‌డౌన్‌, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను జితేంద్ర కలిశారు. నాసిక్‌ వెళ్లొచ్చిన ఆ పోలీస్‌ ఆఫీసర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ ఆఫీసర్ కాంటాక్ట్ అయిన మంత్రి సహా 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మంత్రికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. తాజాగా పాజిటివ్ వచ్చింది. కాగా దీనికంటే ముందు తన సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకడంతో.. జితేంద్రతో పాటు 15 మంది కుటుంబసభ్యులు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles