9-month-old youngest and fastest to recover from Covid-19 కరోనా కాటు వేసినా.. బయటపడ్డ 9నెలల శిశువు

9 month old youngest and fastest to recover from covid 19 in uttarakhand

9-month-old recover from Covid 19, 9-month-old recovered from Corona in Uttarakhand, Coronavirus India news, Coronavirus India News Updates, coronavirus live news , Dehradun, Rishikesh, Indian Forest Service, Doon Hospital, Dehradun, Deepjyoti Kalita, covid, coronavirus, Anurag Agarwal, All Indian Institute of Medical Sciences, AllMS, Uttarakhand

In what is being dubbed as the fastest recovery from Covid-19 in Uttarakhand, a nine-month-old baby boy, the youngest patient in the state so far ---- who was admitted at Doon Hospital on March 17--- was discharged within six days of treatment

కరోనా కాటు వేసినా.. ఆరు రోజుల్లోనే బయటపడ్డ 9నెలల శిశువు

Posted: 04/24/2020 11:57 AM IST
9 month old youngest and fastest to recover from covid 19 in uttarakhand

దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. వైరస్‌ వ్యాప్తికి మాత్రం ఇంకా అడ్డుపడటం లేదు. ఎమర్జెన్సీ పనులపై బయట తిరిగే వారికే కాదు.. ఇంట్లో ఉండే చిన్నారులను కూడా కరోనా మహమ్మారి కాటు వేస్తోంది. తల్లి లేదా తండ్రి సాయంతో మాత్రమే ఇంట్లోంచి బయటకు వెళ్లే 9 నెలల చిన్నారికి కరోనా సోకడం, తల్లి గర్భం నుంచి బయటపడిన రోజుల వ్యవధిలోని బిడ్డలను కూడా ఈ మహమ్మారి టార్గెట్ చేస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ మహమ్మారి బారిని పడుతున్నారు.

ఉత్తరాఖండ్‌లో 9 నెలల వయసున్న ఓ పసికందు కరోనాను జయించి వార్తల్లోని వ్యక్తిగా మారాడు. కరోనాతో ఆ బాబును ఏప్రిల్ 17న ఆసుపత్రిలో చేర్పించగా.. గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆరు రోజుల్లోనే ఆ చిన్నారి కోవిడ్ నుంచి బయటపడటం విశేషం. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయితే ఆ చిన్నారికి తండ్రి ద్వారా కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి తబ్లీగా జమాత్‌కు వెళ్లగా.. కరోనా సోకడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి గురించి ఆసుపత్రి డాక్టర్ ఎన్‌ఎస్‌ ఖాత్రి మాట్లాడుతూ.. నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసు ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని అన్నారు.

తల్లి సహా ఆ ఇంట్లోని వారందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని. కానీ ఆ చిన్నారి మాత్రమే కరోనా సోకిందని ఆయన తెలిపారు. పాలు తాగే వయసు కావడంతో.. చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్లు వివరించారు. ఆ చిన్నారిలో కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించలేదని, నవ్వుతూ ఉన్నాడని చికిత్స అందించిన డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఆ పసికందు కోసం మందులను ఎక్కువగా వాడలేదని, కరోనా నుంచి ఆ చిన్నారి కోలుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles