Coronavirus: US reports 1738 deaths in 24 hours అగ్రరాజ్యంలో తగ్గుముఖం పట్టిన కరోనా మరణాలు

Us coronavirus death toll tops 48 000 johns hopkins data

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The coronavirus death count exceeded 48,000 in the United States. In the last 24 hours, deaths have risen by 1,738 in the US - a small decrease on yesterday's near-record total of 2,400. Confirmed cases also surged with 29,304 new cases, taking the total to 856,584- up more than 210,000 in a week

అగ్రరాజ్యంలో తగ్గుముఖం పట్టిన కరోనా మరణాలు

Posted: 04/23/2020 09:53 AM IST
Us coronavirus death toll tops 48 000 johns hopkins data

కరోనావైరస్ ధాటికి మృత్యు ఘంటికలు మ్రోగుతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇవాళ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్వవధిలో అమెరికాలో 1738 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో అంతకుముందు రెండు రోజులతో పోల్చితే మరణాల సంఖ్య తగ్గుముఖ పడుతుండటం అగ్రరాజ్యవాసులకు, పాలకులకు కొంత ఊరటనిస్తోంది, కరోనా వైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే అగ్రరాజ్యంలోని లక్షలాధి మంది దీని బారిన పడి చికిత్స పోందుతుండగా, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 17 వేలు దాటింది. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య అగ్రరాజ్యంలో ఎనమిదిన్నర లక్షల మార్కు దాటింది.  ప్రపంచంలో మరే దేశంలోనూ ప్రభావం చూపనంతగా కరోనా మహమ్మరి అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 8,52,703 మంది వైరస్‌ బారిన పడగా, 47,750 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో ఏకంగా 1738 మంది మృతి చెందారు.

ఇక మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో కాసింత ఊరట చెందిన అగ్రరాజ్యవాసులకు మరో చేధు వార్త వినిపించింది. రాబోయే రోజుల్లో అమెరికాలో వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అక్కడి వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) డైరెక్టర్‌ రాబర్డ్‌ రెడ్‌ఫీల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న శీతాకాలంలో వైరస్‌ విజృంభించే ప్రమాదముందని, దీంతోపాటు ఫ్లూ కూడా విస్తరించే ముప్పు పొంచి ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles