SBI waives ATM transaction charges లాక్ డౌన్ 2.0: శుభవార్త చెప్పిన బ్యాంకింగ్ రంగ దిగ్గజం

Sbi waives service charges for all atm transactions

covid-19, coronavirus, lockdown, fight aginst covid-18, Guidelines for Lockdown, MHA, lockdown, Ayush Mantralaya, ayush mantralay, ayush guidelines for covid 19, SBI, State Bank of India, SBI Online, savings account, Banking, Banking & Finance, Banking & Financial Services, Personal Finance, Personal Finance, Personal Finance News, Business NewsNational Politics

SBI Savings Account: State Bank of India (SBI) savings account interest rates have been reduced much to the disappointment of many account holders. However, an alternative has been introduced. SBI has introduced SBI BSBD account, which is commonly known as Basic Savings Bank Deposit Account.

లాక్ డౌన్ 2.0: శుభవార్త చెప్పిన బ్యాంకింగ్ రంగ దిగ్గజం

Posted: 04/16/2020 06:49 PM IST
Sbi waives service charges for all atm transactions

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నియోగదారులకు శుభవార్త అందించింది. ఎంత సేపు కస్టమర్లను వాతలు పెట్టి వారి జేబులోంచి డబ్బులు చాకచక్యంగా తస్కరించేలా వ్యవహరించే బ్యాంకులు.. అపత్కాల సమయంలో మాత్రం తమలోనూ మంచి గుణం వుందని నిరూపించుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగ దిగ్గజం కస్టమర్లకు మేలు చేసే మరో చక్కని నిర్ణయం తీసుకుంది.

గత నెలలో మినిమం బ్యాలెన్స్ మెయింటనెన్స్ పై ఛార్జీలను ఎత్తివేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తాజాగా అపత్కాల సమయంలో ఏటీఎం విత్ డ్రాయల్స్ పై సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎస్బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్ బీఐ ఏటీఎంలే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఎస్ బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లైనా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్ బీఐ అధికారులు స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వెసులుబాటు జూన్ 30 వరకు మాత్రమే వర్తిస్తుందని ఎస్ఐ వెల్లడించారు. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడతున్నారు. ఈ నిర్ణయం ఎస్బీఐ కస్టమర్లకే కాకుండా ఇతర బ్యాంకు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles