EPFO settles 3.31 lakh PF withdrawal claims లాక్ డౌన్ వేళ పక్షం రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్ క్లెయిమ్స్ పరిష్కారం

3 31 lakh pf withdrawal claims processed in 15 days epfo

coronavirus, coronavirus cases, COVID-19 pandemic, corona virus India, processed, PF, claims, Provident Fund, covid 19, epfo, COVID-19 pandemic, coronavirus updates, PF, coronavirus breakout, coronavirus spread, epfo, India, PF claims, Crime

The Employees Provident Fund Organisation, said it has processed 3.31 lakh provident fund withdrawal claims amounting to Rs 946.49 crore in 15 days. Government had notified the special withdrawal provision from the EPF Scheme on March 28 to tide over the COVID-19 pandemic

లాక్ డౌన్ వేళ పక్షం రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్ క్లెయిమ్స్ పరిష్కారం

Posted: 04/16/2020 05:47 PM IST
3 31 lakh pf withdrawal claims processed in 15 days epfo

దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించింది కేంద్రం. దీంతో దేశంలో పలు ఉద్దీపన పథకాలు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాని గరభీ హటావ్ పథకాలు కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని కార్మకులకు కేంద్రం కూడా ఉద్దీపన ప్రకటించింది. తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా పీఎఫ్ లో జమ చేసిన మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసలుబాటు కల్పిందింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక మంది తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి విత్ డ్రాలు చేపట్టారు. ఓ వైపు దేశం మొత్తం లాక్ డౌన్ పేరుతో ఇళ్లలో కూర్చుండగా, పీఎఫ్ శాఖ మాత్రం రికార్డు స్థాయిలో తమ పనితీరును కనబర్చింది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుంచి వెల్లువెత్తిన అర్జీలను పరిష్కరించే క్రమంలో కేవలం పదిహేను రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్‌ క్లెయిమ్స్‌ను పరిష్కరించామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా దరఖాస్తు చేసుకున్న చందాదారులకు రూ.950 కోట్లు విడుదల చేశామని వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు గురవ్వకుండా ఉండేందుకు పీఎఫ్‌ నగదును ప్రత్యేకంగా ఉపసంహరించుకొనేందుకు కేంద్రం ప్రభుత్వం 2020, మార్చి 28న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) పథకంలో భాగంగా సంఘటిత కార్మికులకు కొంత ఉపశమనం కల్పించింది. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన 15 రోజుల్లోనే 3.31 లక్షల క్లెయిమ్స్‌ పరిష్కరించామని రూ.946.49 కోట్లు విడుదల చేశామని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మినహాయింపు పొందిన పీఎఫ్‌ ట్రస్టుల పథకంలో భాగంగా రూ.284 కోట్లు పంపిణీ చేశారని వెల్లడించింది. ఇందులో టీసీఎస్‌దే సింహభాగమని పేర్కొంది. కరోనా సహాయ నిబంధనల ప్రకారం భవిష్య నిధిలో జమైన 75 శాతం లేదా మూడు నెలల బేసిక్‌+డీఏ ఏది తక్కువైతే అది వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles