govt suspends zoom app for school education ఆన్ లైన్ పాఠాల్లో అశ్లీల వీడియోలు.. షాక్ తిన్న టీచర్లు..

Zoom app suspended in singapore after hackers show porn in online classes

Zoom, group video app, Hackers, Post, obscene videos, obscene images, screens, covid-19, online learning, school education, pornography

Singapore’s Ministry of Education just announced that the schools will suspend their use of the Zoom platform after students reported encountering pornography while using the application. According to a student’s mother, who posted about the issue on Facebook,

ఆన్ లైన్ పాఠాల్లో అశ్లీల వీడియోలు.. షాక్ తిన్న టీచర్లు..

Posted: 04/13/2020 08:48 PM IST
Zoom app suspended in singapore after hackers show porn in online classes

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోన్న తరుణంలో అన్ని దేశాలు ఈ వైరస్ లింక్ ను తుంచేందుకు ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించాయి. ఆఫీసులు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఇందులో పాఠశాలలు, స్కూల్స్ కూడా ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుండడంతో ఆన్ లైన్ పాఠాలపై పలు స్కూల్స్ దృష్టి పెట్టాయి. విద్యార్థులు ఎంచక్కా ఇళ్లలో నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ఓ పాఠశాల తమ విద్యార్థులకు అన్ లైన్ లో పాఠాలు నేర్పితున్న సమయంలో అకస్మాత్తుగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ పాఠాలు చెబుతుండగా అశ్లీల దృశ్యాలు కనిపించడంతో అందరూ షాకింగ్ గురయ్యారు.

ఈ ఘటనతో సదరు పాఠశాల తాము విద్యార్థులకు ఆన్ లైన్లో పాఠాలు నేర్పేందుకు వినియోగించిన జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ ను కూడా బహిష్కరించింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో పాఠశాలలను మూసివేస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఎప్పటిలాగానే విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. అకస్మాత్తుగా తెరపై అసభ్యకరమైన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయయి. దీంతో షాక్ కు గురయ్యారు. అవాక్కైన టీచర్లు వెంటనే క్లాసులను నిలిపివేశారు.

తాము దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, అవసరమయితే..పోలీసు కేసు నమోదు చేస్తామని విద్యాశాఖ వెల్లడిస్తోంది. భద్రతా లోపాలను సవరించే వరకు ఉపాధ్యాయులెవరూ జూమ్ అప్లికేషన్ ను వాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నామని జూమ్ సంస్థ వెల్లడించింది. భద్రతను పెంచేందుకు యాప్ లో డీఫాల్ట్ సెట్టింగ్ లు మార్చడం జరిగిందని, ఆన్ లైన్ తరగతుల నిర్వాహణకు ప్రత్యేక సూచనలు చేయడం జరిగిందని తెలిపింది. అసలు ఆన్ లైన్ క్లాసులోకి హ్యాకర్లు ఎలా ప్రవేశించారనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. జామ్ మీటింగ్స్ కు ఓ యూజర్ ఐడీ ఉంటుందని, సెక్యూర్టీ సెట్టింగ్స్ సరిగ్గా లేకుంటే..గుర్తు తెలియని వ్యక్తులు అందులో ప్రవేశించే వీలు ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles