Duo from Hyderabad held after liquor video goes viral ఇద్దరు యువకులకు అరదండాలు వేయించిన టిక్ టాక్ వీడియో

Duo from hyderabad held after liquor video goes viral

Sanju Kumar, Nitin, social media platforms, TikTok, telangana excise minister, V Srinivas Goud, Coronavirus Pandemic, Coronavirus, community spread, lockdown, coronavirus outbreak, coronavirus, covid 19, Telangana, Crime

Two men from the city wanted to emulate a person in Jalandhar by serving liquor to a group of persons during the lockdown and attain limelight by filming it. But, their video of serving liquor to labourers in Champapet had not only gone viral but also led to their arrested.

ఇద్దరు యువకులకు అరదండాలు వేయించిన టిక్ టాక్ వీడియో

Posted: 04/14/2020 09:33 AM IST
Duo from hyderabad held after liquor video goes viral

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మానవజాతిని కాకవికళం చేస్తున్న వేళ.. ప్రభావం బారిన పడిన దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తూ.. ప్రజల అరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్ దేశం కూడా అలాంటి చర్యలకే శ్రీకారం చుట్టింది. పలు రాష్ట్రాల్లో మధ్యం బాబులు మతిస్థిమితం తప్పినట్టు వ్యవహరిస్తుండగా,  కరోనా మహమ్మారి పంజా చాపిన తరుణంలో వీరి ఆరోగ్య పరిరక్షణకు ఎర్రగడ్డ చెస్ట్ అసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇలాంటి వారి బాధలు అధికమవుతున్న క్రమంలో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఓ వీడియో తీసిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యారు.

సోషల్ మీడియాలో తాము హీరోలుగా మారాలని భావించిన ఇద్దరు యువకులు.. టిక్‌టాక్ వీడియోల్లో కొంత వెరైటీ చూపించాలనుకున్నారు. అయితే వీరికి తెలంగాణ పోలీసులు అరదండాలు వేశారు. ఈ ఇద్దరు యువకులను కటకటాపాలు చేశారు. ఇంతకీ ఏ జరిగిందంటే.. హైదరాబాద్‌లోని ఈద్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు కుమార్‌ సంజూ, నితిన్‌ టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈసారి కొంత విభిన్నంగా వీడియోలు చేయాలని తలపోశారు. ఇందుకోసం మద్యాన్ని ఎంచుకున్నారు. మందుబాబులకు మద్యం పోస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు.

అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడ్డాయి. వెంటనే స్పందించిన ఆయన లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించడంతోపాటు మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles