fine imposed for not wearing mask in andhra pradesh ఆంద్రప్రదేశ్ లో మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.1000 జరిమానా..

Andhra pradesh police imposing fine for people not wearing mask

covid-19, coronavirus, coronavirus in ap, covid-19 in ap, mandatory, commpulsory, masks, disposalble, N-95 masks, home made cotton masks, double layer reusable masks, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in kadapa, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates, Guntur police, Andhra Pradesh

Andhra Pradesh Police made mandatory the wearing of mask for the people who are comming out on emergency works, Guntur Police are imposing fine on the people who are violating this mandatory condition.

ఆంద్రప్రదేశ్ లో మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.1000 జరిమానా..

Posted: 04/10/2020 02:26 PM IST
Andhra pradesh police imposing fine for people not wearing mask

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిని నివారణకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని పర్యాయాలు చెప్పినా.. ఎంత బతిమాలినా.. కొంతమందికి మాత్రం అసలు పట్టడం లేదు. వీరికి వైరస్ తీవ్రత, ప్రభావం తెలిసే ఇలా చేస్తున్నారా.? లేక తెలియక ఇలా చేస్తున్నారా తెలియదు కానీ లాక్ డౌన్ ను యదేశ్చగా బ్రేక్ చూస్తూ రోడ్లపై విహరిస్తున్నారు. అందులోనూ ముఖానికి ఏమీ లేకుండానే బయటకు వెళ్తున్నారు. దీంతో ఇలాంటివారిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ఉపేక్షించకూడదని వారు నిర్ణయించుకున్నారు. తాజాగా మరో నిబంధనను అమల్లోకి తీసుకువచ్చారు.

దీంతో ఇకపై రాష్ట్రంలో లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చినా.. మాస్క్ లేకుండా తిరుగుతున్నా వారి నుంచి రూ. 1000 ఫైన్ వేయ్యాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలని అమరావతి సహా విజయవాడలో అధికంగా ప్రబలుతున్న ఈ వైరస్ గుంటూరు, కృష్ణా జిల్లాలో జడలు విప్పుతోంది. ఈ జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.

జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తే..తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని అధికారులు సూచించారు. ఒకవేళ మాస్క్ లు వేసుకోకపోతే..రూ. 1000 జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు, ఇతర వాటిని కొనుగోలు చేయడానికి కేవలం ఒక్కరే రావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ఆఫీసులకు చేరుకోవాలన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు రహదారులపైకి ఉద్యోగులను అనుమతించేది లేదని అధికారులు ఖరాఖండిగా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles