TN cops ''stray'' into Karnataka territory; question HM కర్ణాటకలో ఆ రాష్ట్ర హోంమంత్రినే ప్రశ్నించిన పోలీసులు..!

Tamil nadu police entered karnataka stopped its home minister during lockdown

Coronavirus lockdown, covid19, Tamil Nadu police, Karnataka territory, TN police in Karnataka, Karnataka news, Karnataka Home Minister, Basavaraj Bommai, karnataka lockdown, tamil nadu lockdown

Karnataka Home Minister Basavaraj Bommai faced embarrassment when police personnel from neighbouring Tamil Nadu, guarding borders in view of the coronavirus lockdown, unaware of his identity briefly stopped him and sought to know the purpose of his outing during a visit to the area.

కర్ణాటకలో ఆ రాష్ట్ర హోంమంత్రినే ప్రశ్నించిన పోలీసులు.. హాట్ టాపిక్.!

Posted: 04/10/2020 01:24 PM IST
Tamil nadu police entered karnataka stopped its home minister during lockdown

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. అయితే తమ పనితీరుతో ఇలా ప్రశంసలను అందుకున్న పోలీసులు ఆదమరచి మరీ విధులు నిర్వహించడమే ఇప్పుడు వారిని వార్తల్లో నిలిచేలా చేసింది. అదేంటి అదమరచి విదులు నిర్వహించమేంటి.? అనుకుంటున్నారా.? ఔనండీ.. తాము ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్‌డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగతి కూడా మర్చిపోయారు.

కర్ణాటకకు వెళ్లి ఆ హోం మంత్రి కారును తమిళనాడు పోలీసులు ఆపేశారు. మంత్రిని అని చెప్పినప్పటికీ ఐడీ కార్డు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆరాలు తీశారు. ఈ ఘటనకు కర్ణాటక హోం మంత్రి అవాక్కయ్యారు. వెంటనే ప్రాంతంలోని రూరల్ పోలీసులను పిలిపించారు. ఎస్పీ రవి డీ చన్నావర్ రాగానే తమిళనాడు పోలీసులు బోర్డర్ దాటి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టారంటూ బొమ్మాయ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

ఆయన పోస్టు సారాంశం సాగిందిలా.. ‘‘ఈ రోజు నేను నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లాను. పలు ప్రాంతాలు తిరిగిన అనంతరం.. తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టి ఉండటం గమనించాను. బెంగళూరు పోలీసులను పిలిపించి బారికేడ్లు తీయించాను’’ అని పోస్టు చేశారు. ఇక దీనిపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రవి.డి చన్నావర్ మాట్లాడుతూ.. తమిళనాడు పోలీసులు కర్ణాటకలోకి వచ్చేసి బారికేడ్లు పెట్టారు. వాటిని మేం చెప్పిన వెంటనే తొలగించారని అని అన్నారు.

వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ లు ఉన్నారు. అయితే వీరికి కూడా రాష్ట్ర సరిహద్దులపై పెద్దగా అవగాహన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, కర్ణాటక హోం మంత్రిని తమిళనాడు పోలీసులు ప్రశ్నించిన దానిపై వార్తల్లోకి వచ్చిన తర్వాత సర్దిచెప్పుకున్నారు. మంతివర్యులకు సాయం చేసేందుకే మేం అక్కడికి వచ్చామని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఈ వార్త రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles