IT refunds up to Rs 5 lakh to be released immediately కోవిడ్-19: శుభవార్తను అందించిన ఆదాయ పన్నుశాఖ

Govt to give income tax refunds up to rs 5 lakh immediately due to coronavirus impact

coronavirus, covid-19, Narendra Modi, Income Tax, prfunds release, Nirmala Sitaraman, IT Department, taxpayers, business entities, gst, custom refunds, Humanitarian grounds, indian economy, Indian financial status, national issue, corona pandemic

The Income Tax Department, on its official Twitter handle, announced that it will issue all pending income tax refunds up to Rs 5 lakh immediately to individuals and business entities. The decision has come in the due to the coronavirus lockdown in the country. According to press note of the department, this decision would benefit around 14 lakh taxpayers.

కోవిడ్-19: శుభవార్తను అందించిన ఆదాయ పన్నుశాఖ

Posted: 04/08/2020 09:33 PM IST
Govt to give income tax refunds up to rs 5 lakh immediately due to coronavirus impact

దేశంలో అన్నివర్గాల ప్రజలను కరోనా వైరస్‌ మహమ్మారి భయకంపితుల్ని చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డ వేలాదిమంది ప్రజలు పలు అసుపత్రులలో చికిత్స పోంతదుతున్నారు. కాగా లక్షలాది మంది ప్రజలను కూడా అదుపులోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వాలు వారికి పలు ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించాయి. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కోరుతున్న ప్రభుత్వాలు, పాలకులు.. ప్రజలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలుపుతూ.. సూచనలు పాటించాలని కోరుతున్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అల్పాదాయ వర్గాలకు కేంద్రం శుభవార్తను అందించింది. అల్పాదాయ వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ వెల్లడించింది.

ఐదు లక్షల రూపాయల్లోపు ఉన్న రిఫండ్‌లను తక్షణం విడుదల చేయనున్నారు. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో 14 లక్షల మందికి ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకూ లబ్ధి చేకూరనుంది. ఎంఎస్‌ఎంఈలకూ ఇది వర్తిస్తుంది. రిఫండ్‌ల చెల్లింపుల కోసం మొత్తం రూ.18 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles