Coronavirus: US reports nearly 13000 deaths అమెరికాలో 13వేలకు చేరిన కరోనావైరస్ మృతులు

Coronavirus us reports nearly 13000 deaths 1900 deaths in 24 hours

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The novel coronavirus has infected more than 1.4 million people and killed more than 82,080 worldwide, according to Johns Hopkins University. The US has 399,667 cases and nearly 13,000 deaths, according to revised figures.

కరోనా కరాళ నృత్యం: అగ్రరాజ్యంలో 13 వేలకు చేరిన మరణాలు.. వ్యాధి బారిన 4 లక్షలు

Posted: 04/08/2020 08:55 PM IST
Coronavirus us reports nearly 13000 deaths 1900 deaths in 24 hours

కరోనా వైరస్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ తరుణంలో పరోక్షంగా కూడా దీని ప్రభావం బారిన పడి పలువురు మరణిస్తున్నారు. కొందరు ఈ భయంకర మహమ్మారి గురించి తెలుసుకుని అందోళన చెందిన మరణించగా, మరికోందరు రోగం బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విలయతాండం చేస్తున్న కరోనా మహమ్మారి ధాటికి ఏకంగా పదిహేను లక్ష్ల మంది దీని బారిన పడ్డారు. కాగా, 87 వేల 870 మంది ఈ వ్యాధి బారినపడి మరణించారు.

అయితే ఈ వ్యాధిబారిన పడి కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల 19, 278గా వుంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదకొండు లక్షల 17వేల 675 మంది ఈ వ్యాధి బారినపడి చికిత్స పోందుతున్నారు. వీరిలో 48వేల మంది పరిస్థితి విషమంగా వుంది. కాగా పది లక్షల 69వేల 657 మంది పరిస్థితి నిలకడగా వుందని గణంగాలు తెలుపుతున్నాయి. కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడిపోతోంది. పలు దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఫలితంగా అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది.

మృతదేహాలపై కప్పే లక్ష కవర్లు అర్డర్ ఇచ్చారన్న వార్తలతో అక్కడ కరోనాైవైరస్ ఎంతలా విలయతాండవం చేస్తోందో ప్రపంచ దశాలకు అర్థం అవుతోంది. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో  మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1900 మంది మృత్యువాత పడ్డారంటే తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు, కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,878కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 3,99,667 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,020 మంది కోలుకున్నారు.

అయితే, దేశంలో పరిస్థితులు నెమ్మదిస్తున్నాయని, గతంలో ఉన్నంత విషమంగా పరిస్థితులు లేవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే, ఇప్పుడంత తీవ్రత లేదని తాజాగా పేర్కొన్నారు. ఇక, న్యూయార్క్‌లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ ఇప్పటి వరకు 1.38 లక్షల మంది కరోనా బారిన పడగా, 5,400 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ పక్కనే ఉన్న న్యూజెర్సీలోనూ 1200 మంది మృతి చెందారు. అక్కడ 44,416 మంది కరోనా బారినపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh