63 New Coronavirus Cases Reported In Telangana తెలంగాణలో మరో 63 కరోనా పాజిటివ్ కేసులు..

63 new coronavirus cases reported in telangana tally rises to 427

coronavirus,coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana,' Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

63 new coronavirus cases were reported as of 4:30 PM on Apr 08 in Telangana, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in Telangana to 427. Among the total people infected as on date, 35 have recovered and 7 have passed away.

తెలంగాణలో మరో 63 కరోనా పాజిటివ్ కేసులు.. 427కి చేరిన సంఖ్య

Posted: 04/08/2020 05:51 PM IST
63 new coronavirus cases reported in telangana tally rises to 427

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 11 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో అనేక మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 63 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల 427కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ గణంకాలు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు నమోదైనవి.

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్‌ మసీదులో తబ్లీగి జమాత్ ప్రార్థనలకు హాజరై తిరిగివచ్చిన వారితో తెలంగాణలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో నిన్న 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 63 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 427కు పెరిగింది. ఇప్పటికే మరణించిన 11 మందిలో రమారమి అందరూ మర్కజ్ లింకు వున్నవారేనని సమాచారం.  కాగా, మరో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వారిని డిశ్చార్జి చేశారు. పాజిటివ్ వచ్చిన రోగులందరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

తెలంగాణలోని 427 యాక్టివ్‌ కేసుల్లో హైదరాబాద్ నగరంలోనే బాధితులు ఎక్కువగా ఉన్నారని సమాచారం. హైదరాబాద్లో ఇప్పటికే 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా తాజాగా నమోదైన 63 మందిలో హైదరాబాద్ కు చెందిన వారు కూడా వున్నారు. అయితే వీరి గణంకాలను తెలియాల్సి వుంది. ఆ తర్వాత ప్లేస్‌లో వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, నల్లగొండ, మేడ్చల్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, భద్రాద్రి, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌ లు నిలిచాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh