15 new covid-19 cases in AP ఏపీలో 329కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

15 new coronavirus cases reported in andhra pradesh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus update

15 new coronavirus cases were reported in Andhra Pradesh, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in the state to 329. Among the total people infected as on date, 4 have passed away

ఆంధ్రప్రదేశ్ లో 15 కొత్త కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తంగా 329కి చేరిన సంఖ్య

Posted: 04/08/2020 04:49 PM IST
15 new coronavirus cases reported in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 329కి చేరింది. ఇవాళ కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కొవిడ్‌ లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. 3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లను దిగుమతి చేసుకుంటున్నారు. రాబోయేరోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్ లు చేస్తామన్నారు.

ఈ తరుణంలో ప్రైవేట ల్యాబ్ లనూ కూడా సంప్రదిస్తున్నామని. టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్‌ చెప్పింది. 240 ట్రూనాట్‌ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్‌, 12 లక్షల సర్జికల్‌ మాస్క్‌లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్‌ 14 లక్షలు సిద్ధంగా ఉంచాం’’ అని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles