Covid-19: Death toll raises to six in Telangana తెలంగాణలో ఆరుగురు కరోనా బాధితుల మృతి

Covid 19 death toll raises to six in telangana

Coronavirus In Telangana, Coronavirus In Hyderabad, Coronavirus In nimabad, Coronavirus In gadwal, Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news, Extend Night Curfew, Coronavirus, Coronavirus Effect Night Curfew Extended, Coronavirus Night Curfew Extended Till April 14, Latest Telangana News

According to the latest reports Six patients affected with coronavirus in Telangana been died during treatment in different hospitals, all having a travel history to aborad countires affected with novel coronavirus.

తెలంగాణలో ఆరుగురు కరోనా బాధితుల మృతి

Posted: 03/30/2020 10:33 PM IST
Covid 19 death toll raises to six in telangana

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వార్తలు వింటూనే ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైనా..  ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. లాక్ డౌన్ ప్రకటించింది. అయినా అందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆంక్షలను పాటించాలని కూడా అదేశించారు. తాజాగా రాత్రి పూఠ కర్ప్యూను కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా కఠిన చర్యలు తీసుకన్న 24 గంటల వ్యవధిలోనే తెలంగాణవాసులు కలవరానికి గురయ్యే విషాద వార్త వినాల్సి వచ్చింది.

తెలంగాణ అరోగ్యశాఖ, వైద్యులు, ప్రభుత్వం చేస్తున్న చర్యలతో ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి వచ్చిన ఒక్క బాధితుడు మాత్రమే మృతి చెందాడని, మిగిలినవారందరూ కోలుకుంటున్నారని ప్రకటించిన మరుసటి రోజునే మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 11 మంది కరోనా వైరస్ బాధితులు కూడా ఆ మహమ్మారి సోకినా బయటపడగలిగారిని చెప్పారు. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పిన తరుణంలోనే ఏకంగా తెలంగాణలో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.  

గాంధీ అసుపత్రిలో ఇద్దరు, అపోలో అసుపత్రిలో ఒకరు, గ్లోబల్ అసుపత్రిలో ఒకరు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు, గద్వాలలో మరోకరు మొత్తం ఆరుగురు మరణించారని వైద్యఅరోగ్యశాఖ పేర్కొంది. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మార్కజ్ లో మతపరమైన ప్రార్థనలు జరిగాయని.. మృతులందరూ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ప్రార్థనల్లో పాల్లోన్నారని సమాచారం. ఆనంతరం వీరందరూ స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తరువాత వీరందరూ కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించాగా వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. తీవ్రమైన దగ్గు, జర్వ బారిన పడిన వీరు అసుపత్రులలో చికిత్స పోందుతూ మరణించారు. అయితే వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం కూడా వుందని వారు ఎవరిని కలిశారు.. ఏయే అసుపత్రులకు వెళ్లారు. అన్న వివరాలను ఆరోగ్య శాఖ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

దీంతో కరోనా వ్యది సోకే ముప్పు వుందని అనుమానితులను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గుర్తించే పనిలో వున్నాయి. అనుమానిలను అసుపత్రులకు తరలింిచిన అధికారులు వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వీరిని క్వారంటైన్ లో వుంచారు. ఈ ప్రార్థనల్లో పాల్గోన్న వారందరూ విధిగా తమ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మర్కజ్ లో జరిగిన మతపర సమావేశాలకు హాజరైన వారి వివరాలను తెలిసినవారు తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని కోరారు. దీంతో భయకంరమైన మహమ్మారిని ప్రభావానికి ఎక్కువ మంది ప్రజలు గురికాకుండా కాపాడుకోవచ్చునని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh