Full refund on e-tickets of cancelled trains లాక్ డౌన్ నేపథ్యంలో రద్దైన రైల్వే టికెట్లకు ఫుల్ రిఫండ్

Irctc urges passengers not to cancel train tickets assures automatic full refund

covid-19, coronavirus, Coronavirus, COVID-19, india lockdown, railways india lockdown, Railway tickets, e-tickets, IRCTC, Full Refund, Aotomatic refund,Coronavirus outbreak, COVID-19 outbreak, India Coronavirus, India COVID-19, Coronavirus update, domestic flights suspended, domestic air travel, commercial airlines, domestic commercial airlines, cargo flights, restriction on domestic air travel, politics

Amid the escalation of the coronavirus COVID-19 positive cases, the IRCTC asked the passengers to not cancel the tickets they have booked online for those trains that have been cancelled and assured them that they will get a full refund automatically.

లాక్ డౌన్ నేపథ్యంలో రద్దైన రైల్వే టికెట్లకు ఫుల్ రిఫండ్

Posted: 03/30/2020 03:23 PM IST
Irctc urges passengers not to cancel train tickets assures automatic full refund

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇటు భారత్ దేశంలోనూ స్టేట్ 2కు చేరుకున్న తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజీజీవనం స్థంభించిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని, ఇళ్లలోంది ఎవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది. ప్రజారోగ్యం పరిరక్షణ కోసం చికిత్స లేని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర తీసుకున్న చర్యలపై ప్రజలందరి సహకారం కూడా కావాలని కోరింది.

దీంతో దేశవ్యాప్తంగా అప్రకటిత కర్ప్యూ పరిస్థితులు అలుముకున్నాయి, ఎక్కడి బస్సులు అక్కడే,  ఎక్కడి రైళ్లు అక్కడి స్టేషన్లలోనే,  ఎక్కడి విమానాలు అక్కడి విమానాశ్రయాల్లోనే ఎక్కడి నౌకలు అక్కడి పోర్టుల్లోనే నిలిచిపోయాయి. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది, కేవలం నిత్యావసర సరుకులను సరఫరా చేసే వాహనాలు మినహాయిసతే ఎలాంటి వాహనాలు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు రద్దయిన రైళ్లలో టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు సైతం పూర్తి సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

రద్దు రుసుముగా మినహాయించే క్లరికల్ చార్జీలను కూడా కలసి పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కంగారు పడుతూ తమ రైలు ప్రయాణాలను కాన్సిల్ చేసుకుంటున్న తరఉణంలో.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో రద్దయిన రైల్వే ప్రయాణాలన్నింటి టికెట్లు అటోమెటిక్ గా కాన్సిల్ అవుతాయని, వాటని ప్రయాణికులు కాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ఆన్ లైన్‌ రిజర్వేషన్లు వాటంతట అవే రద్దయి, పూర్తి సొమ్ము ప్రయాణికుల ఖాతాలో పడుతుందని తలిపింది.

అలాకాకుండా ఒకవేళ ప్రయాణికులే రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉంటాయని రైల్వేశాఖ కొద్దిరోజుల క్రితం పేర్కొంది. అయితే తాజాగా ఆ విషయంలోనూ స్పష్టతను ఇస్తూ.. కాన్సిల్ అయినా, కాన్సిల్ చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు, మినహాయింపులు లేకుండా నిర్ణయం తీసుకుంది. రైళ్ల రద్దు, సడలించిన రిఫండ్‌ నియమాల ప్రకటనకు ముందు కూడా మార్చి 21- ఏప్రిల్‌ 14 మధ్య కాలం నాటి టికెట్లను కౌంటర్ల ద్వారా రద్దు చేసుకున్నవారు సైతం 100 శాతం రిఫండ్‌కు అర్హులని పేర్కొంది. రిఫండ్‌ మొత్తం కోసం టికెట్‌ రద్దు చేసుకున్న తేదీ నుంచి ఆరు నెలల్లోగా నిర్ణీత ఫారం ద్వారా సంబంధిత జోనల్‌ రైల్వే చీఫ్‌ క్లెయిమ్‌ ఆఫీసర్‌ లేదా చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles