Hyderabad: Temples no exception to coronavirus హైదరాబాదులో అనాధగా కరోనా మృతుడి అంత్యక్రియలు

Coronavirus alert hyderabad chilkur s visa balaji temple shuts down

human Relations, last rites, last journey, orphan,coronavirus, covid-19, corona spread, oorona death, 74 years old man, hyderabad, Telangana,

The first coronavirus death in Telangana state of a 74 years old man in nampally of Hyderabad is conducted as an orphan while his relatives, family menbers showed not to attend his last rites

బంధువులు రాలేక.. అయినవారు రాక.. అనాధగా కరోనా మృతుడి అంత్యక్రియలు

Posted: 03/30/2020 02:00 PM IST
Coronavirus alert hyderabad chilkur s visa balaji temple shuts down

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. అన్ని రంగాలపైనా తన ప్రభావాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ హృదయ విదారక ఘటనకు కూడా కారణమయ్యింది. ఈ కరడుగట్టిన వైరస్ చివరాఖరకు మానవ సంబంధాలను సైతం ప్రభావితం చేసింది. కరోనా వైరస్ బారిన పడి అనంతలోకాలకు తరలివెళ్లిన ఓ వృద్దుడు తుది మజిలీకి చేరుకునే నేపథ్యంలో తమ తాహత్తు మేరకు అంతిమ యాత్ర, శాస్తోక్తంగా దహనసంస్కారాలు చేయాల్సి వున్నా.. ఎవరూ రాకపోవడంతో ఓ అనాథ శవంలాగా అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.

ఆయన మరణం ఆయన బంధుజనంతో పాటుగా.. రాష్ట్ ప్రజలందరికీ తెలిసిందీ. ఆయన తుది యాత్రకు, చివరి చూపుకు కూడా నోచుకోకుండా అయినవారు రాలేక, బంధుజనాన్ని రవాణా స్థంభనతో రాలేక.. హెల్త్‌ వర్కర్లే ఆయనకు అన్ని తామై దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందిన మొదటి వ్యక్తి 74 ఏళ్ల వృద్దుడు. కాగా అతని మరణ వార్తను అయినవారికి సమాచారం ఇచ్చినప్పటికీ బంధువులు ఎవరూ హాజరు కాలేదు.

ప్రస్తుత సమయంలో గుంపులుగా ఉంటేనే కరోనా వ్యాపిస్తుందేమో అన్న భయంతో ప్రజలు ఉన్నారు. కానీ ఈ వృద్దుడు కరోనా కారణంగా చనిపోయాడు అని తెలియగానే మృత దేహాన్ని చివరిసారి చూడటానికి ఐన వాల్లు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేదు. దీంతో హెల్త్‌ వర్కర్లు దగ్గరుండి అతని చేసారు. ఈ నెల 14వ తేదీన ఈ వృద్దుడు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాడు. తిరగి 17న వచ్చారు. సరిగ్గా మూడు రోజుల తరువాత అంటే 20వ తేదీన అతను శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.

కాగా అతని పరిస్థితి విషమించడంతో గత గురువారం రాత్రి అతను చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ సూచనల మేరకు సైఫాబాద్‌ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వృద్దుని రక్త నమూనాలను పరిశీంచగా అతనికి కరోనా సోకిందని అతను చనిపోయిన తరువాత రిపోర్టుల వచ్చాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను ప్రస్తుతం ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచడంతోపాటూ వృద్దుడి అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : human Relations  last rites  last journey  orphan  oorona death  74 years old man  hyderabad  

Other Articles