Excise CI suspended after caught transporting liquor illegally లాక్ డౌన్ సమయంలో మద్యం సరఫరా చేసిన సీఐ.. సస్సెన్షన్

Excise ci suspended after been caught red handed transporting liquor illegally

coronavirus, covid-19, Lockdown, MLA Suryanarayana Reddy, illegally liquor, Excise CI, Anaparthi Excise CI Trinadh, Excise and Prohibition Minister, K Narayana Swamy, excise departement, andhra pradesh, crime

Locals and MLA Suryanarayana Reddy have caught Anaparthi Excise CI Trinadh red-handed while transporting liquor illegally in a car. The police found liquor bottles in the car. Locals alleged that the Excise CI was selling each liquor bottle for Rs 4,000 when the original cost is Rs 1,000.

కరోనావైరస్: లాక్ డౌన్ సమయంలో మద్యం సరఫరా చేసిన సీఐ.. సస్సెన్షన్

Posted: 03/30/2020 12:24 PM IST
Excise ci suspended after been caught red handed transporting liquor illegally

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ప్యూతో పాటు రాష్ట్రం మొత్తం లాక్ డౌన విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిగా ప్రజారోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అధికారి.. తనలోని లోభితత్వాన్ని బయటపెట్టి.. కరోనా లాక్ డౌన్ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎత్తు వేయడంతో స్థానికులు.. స్థానికి ఎమ్మెల్యే.. తన నియోజకవర్గ ప్రజలలో కలసి ఎక్సైజ్ సిఐ స్వార్థనికి చరమగీతం పాడారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునంటున్న ప్రభుత్వం ఇప్పటికే పలు అదేశాలను జారీ చేసింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేసింది. ఆ వెనువెంటనే వచ్చిన కరోనా వైరస్ ఉపద్రవాన్ని ఎదుర్కోనేందుకు కేంద్రప్రకటించిన లాక్ డౌన్ తో పోలీసు సిబ్బంది మొత్తం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్నారు. అయితే కొందరి కారణంగా పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. తాజాగా, కారులో మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఎక్సైజ్ సీఐ ఒకరు పట్టుబడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మద్యాన్ని తరలిస్తుండగా కుతుకులూరులో అనపర్తి ఎమ్మెల్యేతో పాటు స్థానికులు ఆయనను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథ్ ను సస్పెండ్ చేయడమే కాక... రూ. 5 లక్షల జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. అంతేకాదు, శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించినట్టు చెప్పారు. అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles