Central govt gives clarity over lockdown extension దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగింపుపై కేంద్రం..

Coronavirus central government gives clarity over lockdown extension

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The Central government has made it clear that there will not be an extension of lockdown. PM Modi had declared a lockdown for 21 days to stop the spread of coronavirus in the country. after rumours have spread on social media that the Centre might extend lockdown for a few more weeks.

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడగింపుపై కేంద్రం క్లారిటీ

Posted: 03/30/2020 11:46 AM IST
Coronavirus central government gives clarity over lockdown extension

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ.. యావత్ దేశం జనతా కర్య్పూను పాటించిన మార్చి 22న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అడపాదడపా అక్కడక్కడా కొందురు ఈ లాక్ డౌన్ అమలును పాటించడం లేదన్న విషయం కూడా వెలుగులోకి రావడంతో కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపి మరీ అమలు చేస్తున్నారు. ప్రజారోగ్యం పరిరక్షించబడాలంటే.. దేశ ప్రజలందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చిన విషయం విధితమే.

అయితే ఇళ్లకుమాత్రమే దేశప్రజలు పరిమితమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిని గాడినపెట్టడంతో పాటు కరోనా ప్రభావంతో కూడా చతికిలపడిన నేపథ్యంలో సామాన్యలతో పాటు పేద బి, మధ్య తరగతి వర్గాలకు మేలు కలిగే విధంగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిపిందే. అయితే ఈ ఉద్దీపన పథకలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలసి ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కేవలం ఏప్రిల్ 14 వరకు మాత్రమే ప్రకటించినా.. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేవరు ఉద్దీపన కల్పించింది.

అయితే ఈ ఉద్దీపన పథకాలను మూడు నెలల పాటు ప్రకటించారు. దీంతో అటు సేదల, మధ్యతరగతి, బీద, మహిళా సంఘాలు, కూలీలు, దినసరి వేతన కూలీలు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు నెలల పాటు ఈ ప్యాకేజీలను వర్తింపజేసింద కేంద్రం. దీంతో ఏప్రీల్ 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిపోతున్నా.. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న క్రమంలో దీనిని మరోమారు పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపణ పథకాలను కూడా చూపుతూ అనేక ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ పోడిగింపు వార్తలపై క్లారిటీ ఇచ్చింది. దేశంలో ఇప్పుడు విధించిన లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీరని ప్రభావాన్ని చూపుతుందని, అయినా ప్రజారోగ్యం నేపథ్యంలో తాము ఎంతో కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. అయితే లాక్ డౌన్ ను పోడగిస్తారన్న వార్తలను మాత్రం తోసిపుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో విధించిన లాక్ డౌన్ పొడిగించే ప్రసక్తే లేదని చెప్పింది. ప్రజలపై విపరీతంగా పడే ఈ ప్రభావం నుంచి అందరూ గడ్డెక్కడానికి ఉద్దీపన పథకాలను మూడు నెలల పాటు ప్రకటించామే తప్ప లాక్ డౌన్ పోడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles