President Ramnath Kovind will get Corona check performed రాష్ట్రపతికి ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు..

President ramnath kovind likely to go for corona virus test

coronaviurs, covid19, coronaviurs india, coronaviurs in india,, Member of Praliament, Dushyanth singh, MPs Team, Ramnath Kovind, President of India, President Ramnath Kocind, kanika kapoor, covid-19, coronavirus, Coronavirus updates, Singer Kanika Kapoor, Bollywood, Coronavirus updates

President Ramnath Kovind can be following the principles issued by the federal government. Now lethal 'Corona virus' Due to doubts in regards to the illness, President Ram Nath Kovind has determined that he’ll get his corona check performed.

రాష్ట్రపతికి ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు..

Posted: 03/21/2020 11:19 AM IST
President ramnath kovind likely to go for corona virus test

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కేంద్ర వైద్య అరోగ్యశాఖ అధికారులు కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖ ద్వారా తాను కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటానని రాష్ట్రపతి తెలిపినట్లు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో వల్లడించింది. విదేశాలకు వెళ్లని రాష్ట్రపతి అంత అర్థాంతరంగా కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కారణం ఏమిటీ.? అన్న  ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కారణం ప్రత్యక్షంగా బీజేపి పార్లమెంటు సభ్యుడే అయినా పరోక్షంగా మాత్రం బాలీవుడ్ గాయని కారణం.

బాలీవుడ్ గాయని కనికా కపూర్ విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత అమె తనకు కరోనా వైరస్ సోకిందని, వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని కూడా తెలిపింది. అయితే లండన్ నుంచి వచ్చీ రాగానే అమె తనకు వైరస్ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేసుకోలేదు. అంతేకాదు లండన్ నుంచి వచ్చిన తరువాత ఏకంగా మూడు పార్టీలలో పాల్గొనిందని అమె తండ్రి తెలిపారు. అయితే అమె ఇచ్చిన పార్టీలో బీజేపి పార్లమెంటరీ సభ్యుడు దుష్యంత్ సింగ్ కూడా పాల్గోన్నాడు. అమె తనకు కరోనా వైరస్ సోకిందన్న విషయాన్ని తెలపడంతో ఆయన కూడా తన హోం క్యారంటైన్ లో వున్నారు.

అయితే, ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలసిన బీజేపి పార్లమెంటరీ సభ్యుల బృందంలో దుష్యంత్ సింగ్ కూడా వున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపి సభ్యులకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles