కరోనా వైరస్ వ్యాప్తితో తిరుమలలో టీటీడీ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ పాలకమండలి ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. రేపటి నుంచి తిరుమలపై వున్న భక్తులందరినీ కొండ దిగువకు తిరుపతికి పంపించనున్నామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తిరుమలకు చేరుకునే భక్తులను అలిపిరి నుంచే అధికారులు తిప్పి పంపిస్తున్నారు. తిరుమలకు చేరకునే అలిపిరి ఘాట్ రోడ్ మూసివేయాలని సిబ్బందికి అధికారులు ఆదేశించారు.
ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలు నిషేధించారు. ఇక తిరుమలకు చేరుకునే రెండు మెట్ల మార్గాలను కూడా అధికారులు మూసివేయించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కిందకు వెళ్లిపోవాలని టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కిందికి వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్ తెరిచి ఉంచింది. ఎక్కడిక్కడ వాహనాలను నిలిపివేశారు. శ్రీపాద మార్గం కూడా అధికారులు మూసివేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఒక బృందంతో కలిసి కొండపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
దివాకర్ అనే భక్తుడు వారణాసిలోని విశ్వానాదుడి దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరుమల కొండకు చేరుకున్నాడు. తిరుమలకు రాగానే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని గుర్తించిన అధికారులు టీటీడీకి చెందిన ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిమ్స్‌కు తరలించగా.. అక్కడి ఐసోలేషన్ వార్డులో బాధితుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించిన అనంతరం టీటీడీ వెంటనే ఆకస్మాత్తుగా ఎగువ ఘాట్ రోడ్డు మూసివేసింది. దీంతో ఆలయాన్ని కొన్ని రోజుల పాటు మూసివేయాలన్న నిర్ణయానికి టీటీడీ పాలకమండలి అధికారులు నిర్ణయానికి వచ్చారు. అత్యున్నత అధికారులంతా కూడా అత్యావసర సమావేశం నిర్వహించిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more