నిర్భయ కేసులో దోషులకు న్యాయస్థానం విధించిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులను మూడు నెలల పాటు ఉపేక్షించిన న్యాయస్థానాలు ఇక నాల్గవ పర్యాయం న్యాయస్థానం జారీ చేసిన డెత్ వారెంటును అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు ఉరి ట్రయల్స్ ను కూడా వేశారు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
కాగా నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ నిన్న మరో దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ ను పటియాలా కోర్టు ఇవాళ కొట్టివేసింది. దీంతో పాటు ఈ ఘటన జరిగినప్పుడు తాను మైనర్ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ పవన్ గుప్తా తన పిటిషన్లో కోరగా, న్యాయస్థానం ఈ పీటీషన్ ను సైతం కొట్టివేసింది. తమకు ఇంకా న్యాయపరంగా అర్హమైన అవకాశాలు ఉన్నాయని, తమ ఉరిని ఆపాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను పటియాలా కోర్టు కొట్టేసింది ఇప్పటివరకు ఎటువంటి లీగల్ రెమెడీస్ పెండింగ్ లో లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టుకి తెలిపారు.
దీంతో ఇటీవల నాల్గవ పర్యాయం జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం ఉదయం నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయబడతారని పటియాలా కోర్టు సృష్టం చేసింది. కాగా, ఈ తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ....కోర్టు ఇప్పటికే వాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చింది. సరిగ్గా ఉరిశిక్ష అమలుకు ముందు వాళ్లు ఏదో ఒక వాదన తీసుకొచ్చి వాయిదా వేయించుకున్నారు. వాళ్ల యుక్తుల గురించి ఇప్పుడు కోర్టులకు కూడా అవగాహన వచ్చింది. రేపు నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆశాదేవి తెలిపారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీయాలని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more