COVID-19: Shirdi to close temple for devotees from today షిరిడీ ఆలయం తాత్కాలికంగా మూసివేత

Coronavirus shirdi saibaba temple to shut from today amid coronavirus scare

Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, Shirdi Saibaba Temple shut, Halwai Ganpati Mandir shut, Mumbadevi Temple closed, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, coronavirus, Kerala coronavirus, Maharashtra coronavirus, coronavirus cases, coronavirus latest, coronavirus updates, India coronavirus, coronavirus in India

In the wake of coronavirus spread in India, Shirdi Saibaba Temple in Maharashtra will close for devotees from 3 pm today till further orders, Shri Saibaba Sansthan Trust appealed to devotees to postpone their visit. Several prominent temples in Maharashtra, including Shreemant Dagdusheth Halwai Ganpati Mandir in Pune and Mumbadevi Temple in Mumbai, will remain closed for devotees till further orders

కరోనా అలర్ట్: ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ ఆలయం తాత్కాలికంగా మూసివేత

Posted: 03/17/2020 12:00 PM IST
Coronavirus shirdi saibaba temple to shut from today amid coronavirus scare

మానవాళి మనుగడకు సవాల్ విసిరేలా విజృంభిస్తూ.. వేలాధి మంది ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంతటి మహిమాన్విత ఫుణ్యక్షేత్రమైన షిరిడి సాయిబాబా మందిరం ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూసివేయబడుతోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తలు మహారాష్ట్రలోని షిరిడీ సాయి మందిర దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని గత ఆదివారం రోజునే షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు భక్తులకు విన్నవించింది.

కరోనా వైరస్ మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తుండడం.. తాజాగా ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు కూడా మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఈ నిర్ణయం తీసుకుంది. షిరిడీలో ఎటువంటి వైరస్ సోకదని, అందుకు సాయిబాబా వేసిన ఊదే కారణమని.. ఈ ప్రాంతంలో ఏలాంటి మహమ్మారులు వచ్చినా సాయిబాబా వాటిని తరుముతారని సాయిభక్తులు విశ్వసిస్తున్నా.. ట్రస్ట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ట్రస్టు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు.

మానవాళిపై పంజా విసురుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయం మూసి వేసి ఉంటుందని ట్రస్టు వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. ముంబై సిద్ధి వినాయక ట్రస్ట్ సైతం రెండు రోజుల క్రితమే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని భక్తులకు వెల్లడించింది. ఈ క్రమంలో సిద్ది వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. పుణెలోని శ్రీమంత్ గణపతి మందిర్, ముంబైలోని ముంబాదేవి ఆలయాలను కూడా దేవాలయ కమిటీలు నిర్ణయం తీసుకుని ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ దేవాలయాలు మూసివేసి ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles