Coronavirus: Patient dies in Maharashtra taking death toll to 3 దేశంలో మూడో కరోనా మరణం..మహారాష్ట్రవాసి మృతి

Novel coronavirus india verging upon nationwide lockdown

Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, coronavirus, Kerala coronavirus, Maharashtra coronavirus, coronavirus cases, coronavirus latest, coronavirus updates, India coronavirus, coronavirus in India, coronavirus symptoms, coronavirus medicine, coronavirus drugs, coronavirus treatment, coronavirus prevention, masks, hand sanitizers

According to PTI quoting health ministry, a coronavirus patient in Maharashtra has died taking the death toll in India to three. Coronavirus pandemic continues to wreak havoc across countries and take a toll on multiple economies.

దేశంలో మూడో కరోనా మరణం..మహారాష్ట్రవాసి మృతి

Posted: 03/17/2020 11:31 AM IST
Novel coronavirus india verging upon nationwide lockdown

పుడమిపై మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తూ.. విజృంభిస్తున్న కరోనావైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా 125 మందిని పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధి ఉద్భవించిన చైనాలోని వూహన్ నగరంలో.. వేలాధి మంది కబళించిన ఈ మహమ్మారి.. మనదేశంలోనూ మూడో వ్యక్తిని బలి తీసుకుంది. కరోనావైరస్ ఎంత కరుడుగట్టిందో ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు.. హృదయవిదారక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే భారత దేశానికి వచ్చిన ఈ మహమ్మారి.. దేశంలోనూ మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది.

కరోనా ప్రభావం ఉష్ణవాతావరణం గల భారత్ పై అంత ఎక్కువగా వుండదని ఇప్పటికే అనేకమంది నిపుణులు చెబుతున్నా.. విదేశాల నుంచి వచ్చి ఇద్దరు వృద్దులను ఇప్పటికే బలి తీసుకుంది. తొలుత కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్దుడిని బలి తీసుకున్న ఈ మహమ్మారి.. ఆ తరువాత ఢిల్లీలోని మరో 68 ఏళ్ల వృద్దురాలిని కూడా పొట్టన బెట్టుకుంది. తాజాగా మరో 64 ఏళ్ల వృద్దుడిని కూడా కబళించివేసింది.కరోనావైరస్ సోకడంతో అసువులు బాసిన మూడో ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నమోదైంది.

ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 3కి చేరింది. గతవారంలో కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు,ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. చాపకింద నీరులా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక దేశంలో కరోనా వైరస్ తన ప్రాబల్యం చాటుకుంటోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాతి స్థానంలో కేరళలో విజృంభిస్తోంది.

ఇక విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది. మరో లక్షా 80వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రితం రోజున 157 దేశాలకు మాత్రమే విస్తరించిన ఈ వైరస్.. ఇవాళ 162 దేశాలకు కరోనా వైరస్ పాకింది. అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనా తర్వాత స్థానంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్, కువైట్, కొరియా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచదేశాలన్నింటినీ అప్రమత్తం చేసిన ప్రపంచ అరోగ్య సంస్థ.. కరోనా కట్టడికి పలు సూచనలను కూడా జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles