Coronavirus updates: 169,610 cases, 6,518 deaths దేశీయంగా 112 కేసులు.. కోలుకున్న 10 మంది రోగులు

India s confirmed coronavirus cases rise to 112 as maharashtra s numbers surge

Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, coronavirus, Kerala coronavirus, Maharashtra coronavirus, coronavirus cases, coronavirus latest, coronavirus updates, India coronavirus, coronavirus in India

According to the latest reports, the total number of coronavirus cases worldwide has hit 169,610 with 6,518 deaths in 157 countries. A sharp surge in cases in Maharashtra took the number of Covid-19 patients in India to 112 on Sunday from 93 reported the previous day.

ప్రపంచవ్యాప్తంగా 157 దేశాలు.. 169,610 కేసులు, 6,518 మరణాలు

Posted: 03/16/2020 12:45 PM IST
India s confirmed coronavirus cases rise to 112 as maharashtra s numbers surge

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కళారా నృత్యం చేస్తోంది. పశువుల్లో సంక్రమించే ఈ వ్యాధి.. క్రమంగా మనుషులను కూడా కబంధహస్తాల్లోకి తీసుకుంది. అతేకాదు వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ 157 దేశాలకు విస్తరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా నిర్ధారించింది. మొత్తం 1,69,531 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, వారిలో 6,515 మంది మరణించారని వెల్లడించింది. చైనాలో మృతుల సంఖ్య 3,213కు చేరిందని, ఆ తరువాత ఇటలీలో 1,809 మంది, ఇరాన్ లో 724 మంది, స్పెయిన్ లో 292 మంది, ఫ్రాన్స్ లో 127 మంది, దక్షిణ కొరియాలో 75 మంది, అమెరికాలో 68 మంది, యూకేలో 35 మంది, జపాన్ లో 24 మంది, నెదర్లాండ్స్ లో 20 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది.

ఇటు దేశంలోనూ ఏకంగా 112 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. శనివారం రోజు రాత్రి 85గా నమోదైన సంఖ్య సోమవారం ఉదయానికి 112కు చేరడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో అధికసంఖ్యలో ప్రజలు ఈ వైరస్ కబంధహస్తాలలో చిక్కుకున్నారు. తొలుత కేరళవాసులు అనేకమంది ఈ వైరస్ బారిన పడగా, తాజాగా మహారాష్ట్రలో ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు అనేకమంది వున్నారు. ఇదివరకు 15 కేసులు నమోదైన మహారాష్ట్రలో కొత్తగా మరో 19కేసులతో మొత్తంగా 33 కేసులు నమోదయ్యాయి.

ఇటు కేరళలో కరోనావైరస్ పాజిటివ్ నమోదైన 22తో పాటు కొత్తగా మరో రెండు కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో కేరళలో మొత్తం 24 మంది బాధితులు ఈ వ్యాధిబారిన పడ్డారు. ఆ తరువాత అధికసంఖ్యలో బాధితులు వున్న రాష్ట్రంగా 12 కేసులతో ఉత్తర్ ప్రదేశ్, ఆ తరువాత ఏడేసి కేసులతో ఢిల్లీ, కర్ణాటకలు వున్నాయి. ఇటు తెలంగాణలో మూడు కేసులు నమోదవ్వగా ఒకరు పూర్తిగా కోలుకుగా, మరో ఇద్దరు గాంధీ అసుపత్రిలో చికిత్సపోందుతున్నారు. దేశవ్యాప్తంగా 112 కేసులు నమోదుకాగా, వారిలో 10మంది కోలుకోగా, ఇద్దరు గతవారం మరణించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles