Coronavirus: Son's sacrifice for civic sense తండ్రి కడసారి చూపుకు నోచుకోని కరోనా బాధితుడు

Kerala coronavirus suspect watcher father s funeral live video from hospital

Coronavirus outbreak, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, coronavirus, Kerala coronavirus, Qatar coronavirus, coronavirus cases, coronavirus latest, coronavirus updates, Kerala coronavirus cases, India coronavirus, coronavirus in India

It was heartbreaking for 30-year-old Lino Abel to helplessly watch through the window of an isolation ward the body of his father being taken home for the final journey by an ambulance. Having rushed from Qatar, one among the coronavirus affected nations, on March 8, Lino Abel wanted to be with his father who had been hospitalised following a fall from his bed.

కరోనా కలకలం: తండ్రి కడసారి చూపుకు నోచుకోని తనయుడు

Posted: 03/16/2020 11:56 AM IST
Kerala coronavirus suspect watcher father s funeral live video from hospital

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా 110 మందిని పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధి ఉద్భివించిన చైనాలోని వూహన్ నగరంలో.. అనేక మంది జీవితాలను కబళించిన ఈ మహమ్మారి.. ఎంత కరుడుగట్టిందో అక్కడి మరణాలు.. హృదయవిదారక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తండ్రితో పాటు చిన్నకుమారుడికి కరోనా వైరస్ సోకడంతో వారిని అసుపత్రికి తరలించిన ప్రభుత్వం.. వారితో పాటు ఇంట్లో వుండే ఓ మానసిక, అంగవైకల్యం వున్న పెద్ద కొడుకు బాధ్యతలను ఎవరూ పట్టించుకోక పోవడంతో.. అతడు క్షద్భాతదో మరణించిన ఘటన హృదయాలను ద్రవింపజేసింది.

అయితే ఈ మధ్యకాలంలోనే భారత దేశానికి వచ్చిన ఈ మహమ్మారి.. భారత్ దేశంలోనూ అలాంటి ఘటనలనే నమోదు చేసింది. తన తండ్రి కడసారి చూపుకు తనయుడ్ని దూరం చేసింది. ఎక్కడో విదేశాలలో వున్నా.. తండ్రి అకస్మాత్తుగా మంచంపై నుంచి కిందపడ్డాడన్న సమాచారం అందుకున్న తనయుడు సొంత రాష్ట్రానికి.. సొంతఊరికి తరలివచ్చినా.. కరోనా మహమ్మారి మాత్రం వారిని వదలక పట్టుకుని పీడించడంతో.. తన తండ్రి కడసారి చూపుకు నోచుకోని తనయుడు.. అంతిమ సంస్కారాలను కూడా వీడియోకాల్ ద్వారా లైవ్ లో వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆఘమేఘాల మీడ స్వగ్రామానికి వచ్చినా.. తండ్రిని కాపాడుకోలేక.. చివరికు అతని దహనసంస్కారాలు కూడా వీడియోలో వీక్షించాల్సివచ్చిందేనని తనయుడు గుండెపిగిలేట్లు విలపించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయం పట్టణంలో జరిగింది. తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో మరణిస్తే.. కరోనా లక్షణాలతో బాధపడుతూ అదే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఖతార్ నుంచి వచ్చిన తనయుడు లినో అబెల్ (29). విధి ఆడిన విపరీతపు నాటకానికి సంబంధించి వివరాలిలా వున్నాయి.  

తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న లినో అబెల్ (29) ఈ నెల 8న ఖాతార్ నుంచి హుటాహుటిన కేరళ వచ్చాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా 157 దేశాలను పట్టిపీడిస్తున్న దేశాల్లో ఒకటైన ఖాతార్ లో కూడా అబెల్ కరోనావైరస్ సోకింది. విమానాశ్రయంలో జరిపిన స్క్రీనింగ్ పరీక్షల్లో అతడిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కన్నతండ్రిని చూడాలన్న ఆరాటంతో వెంటనే కొట్టాయంలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే, తాను వెళ్లి కలిస్తే కుటుంబ సభ్యులందరికీ ఈ మహమ్మారి సోకుతుందని భావించి మనసు మార్చుకున్నాడు. వెంటనే వైద్యులను కలిసి విషయం చెప్పాడు. వారు అతడిని చికిత్స కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

కాగా, అతను అసుపత్రిలో క్వారంటైన్ చేయబడిన మరుసటి రోజునే అంటే ఈ నెల 9న పరిస్థితి విషమించడంతో అెబల్ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అబెల్.. తండ్రిని కడసారి చూడాలనుకున్నాడు. అయితే, మళ్లీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. చివరికి కిటికీ ద్వారా  తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అది చూసి చలించిపోయిన వైద్యులు.. వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలు చూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  suspect in Kerala  last rites of father  Qatar  lino abel  cardiac arrest  Kottayam  kerala  politics  

Other Articles