TTD performs Dhanvatari Yagam to safeguard humanity from covid-19 మనవాళి పరిరక్షణకు టీటీడీ ధన్వంతరి యాగం

Coronavirus tirupati temple conducts dhanvantari mahayaganam to drive away covid 19

COVID-19, Coronavirus, tirupati, tirupati temple, drive away covid-19, Arjitha sevas, Tirumala tirupati devastanam, dhanvatari yagam, TTD Board, Humanity,TTD, ontimitta Ramalayam, Kadapa, SitaRama Kalyanam, Vasanthosthavam, Andhra Pradesh, politics

The Tirupati temple authorities are now seeking the divine intervention “to safeguard humanity from the dreadful virus.” The Tirumala Tirupati Devasthanams is conducting a three-day Sri Srinivasa Shantyotsava Sahita Dhanvantari Maha Yagam from March 16 to 28.

ప్రపంచ మనవాళి పరిరక్షణకు టీటీడీ ధన్వంతరి యాగం

Posted: 03/16/2020 01:34 PM IST
Coronavirus tirupati temple conducts dhanvantari mahayaganam to drive away covid 19

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ మానవళి మనుగడను సవాల్ చేస్తోంది. పలు దేశాల్లో ఎక్కడికక్కడ అత్యవసర అరోగ్య పరిస్థితులను ప్రకటిస్తున్నాయి. పుడమిపై కళారా నృత్యం చేస్తోన్న ఈ మహమ్మారిని కనిపించకుండా తరిమేయాలని ఓ వైపు వైద్యరంగ ప్రముఖులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ఇల వైకుంఠపురంలోని సప్తగిరులపై ప్రత్యేక యాగాలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం సప్తగిరులపై కూడా కొట్టోచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. తాజాగా యాగాలు చేయాలని కూడా సంకల్పించింది.

ఇందులో భాగంగా ఉదయం స్వామి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, అన్ని రకాల దర్శనాలకూ రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. తిరుమలలో క్యూలైన్లలో వేచి వుండే పద్దతికి స్వస్తి పలికిన టీటీడీ..  ఇప్పటికే టైమ్ స్లాట్ ప్రకారం దర్శనాలను కల్పిస్తోంది. ఇక మరోవైపు స్వామివారికి పలు ఆర్జిత సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి ప్రత్యేక సేవలు కూడా రద్దయ్యాయి.

కరోనా వైరస్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని మానవాళిని గజగజలాడిస్తోన్న తరుణంలో తిరుమల తిరుపతి దేశస్థానం బోర్డు లోకకళ్యాణం కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కావాలని కోరుతూ లోక కల్యాణార్థం ధన్వంతరి మహాయాగాలను నిర్వహించాలని నిర్ణయించింది. నేటి నుంచి 28 వరకూ ఈ యాగాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 4 గంటలకు 30 మంది వేద పండితులతో జపయజ్ఞం జరుగనుంది. ఆస్థాన మండపంలో 25న చతుర్వేద పారాయణం, తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో ప్రత్యేక యాగం జరుగనున్నాయి. 26 నుంచి మూడు రోజుల పాటు శ్రీనివాస శాంత్యోత్స సహిత ధన్వంతరి మహాయాగం జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles