TTD takes steps to check spread of Covid-19 కరోనా అలర్ట్: నో వేయింటింగ్.. టీటీడీ కీలక నిర్ణయం

Coronavirus tirupati temple trust takes steps to check spread of covid 19

tirupati, tirupati temple, covid-19, Arjitha sevas, TTD, ontimitta Ramalayam, Kadapa, SitaRama Kalyanam, Vasanthosthavam, educational institutions, schools, malls, shopping centers, movie theatres, Telangana government, CM KCR, coronavirus scare, covid-19 scare, coronavirus rumours, coronavirus, COVID-19, Coronavirus, covid-19

The Tirupati temple's trust says the footfall of devotees has already thinned, but is implementing preventive measures ranging from limiting the number of devotees in queue compartments and performing thermal scans at entry points.

కరోనా అలర్ట్: నో వేయింటింగ్.. టీటీడీ కీలక నిర్ణయం

Posted: 03/14/2020 07:08 PM IST
Coronavirus tirupati temple trust takes steps to check spread of covid 19

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కళారా నృత్యం చేస్తోంది. పశువుల్లో సంక్రమించే ఈ వ్యాధి వాటినుంచే మనుషులకు కూడా సంక్రమించిందన్న అనుమానాలు అటుంచింతే.. ఈ వ్యాధి ప్రబలకుండా అన్ని దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అనేక దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో వ్యాధి నివారణా చర్యలకు ప్రపంచ అరోగ్య సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ఈ వ్యాధి నష్టనివారణ చర్యలకు పూనుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని ముఖ్యనగరాలలోని జనసామర్థ్యం అధికంగా వుండే ప్రాంతాలను బంద్ చేస్తూ అదేశాలను జారీ చేశారు.

కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపించాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్ మెంట్లలో భక్తులు గుంపుగా వేచి ఉంటే, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంటకు కేవలం నాలుగ వేల మందిని మాత్రమే అనుమతించేలా అదేశాలను జారీ చేసింది.

అంతేకాదు వసంతోత్సవంతో పాటు ఆర్జిత బ్రహోత్సవాలు, సహ్రస దీపాలంకరణ సహా పలు ఆర్జీత సేవలను కూడా రద్దు చేసింది. ఇక ఇదే క్రమంలో అటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. అలాగే ముంబైలోని శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేదీ మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles