Coronavirus: Telangana impliments 1895 act ఏపీలో కరోనా అనుమానితులు.. తెలంగాణలో 1985 యాక్టు

Two foreign returned suffering from symptoms of coronavirus in andhra pradesh

Coronavirus outbreak, corona suspects in AP, Nepal toured indian, Vietmam returned Telugite, Telangana high alert, telangana corona outbreak, 1895 act in Telangana, coronavirus, coronavirus status in telangana, coronavirus in hyderabad, Health administration, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, vikarabad tourism resort isolation ward, mohammad hussian siddiqui, Gulburga hospital staff, Telangana

Two patients with a travel history to Nepal and Vietmam has been quarantined suspected to be positive for COVID-19, from Andhra Pradesh, for further confirmation, the authorities have sent their samples to National Institute of Virology (NIV), Pune. On the other hand Telangana Government bought 1895 act into force in the state, which can quarantine parts of area in the state.

కరోనా వైరస్: ఏపీలో ఇద్దరు అనుమానితులు.. తెలంగాణలో 1895 యాక్టు

Posted: 03/16/2020 11:06 AM IST
Two foreign returned suffering from symptoms of coronavirus in andhra pradesh

కరోనా వైరస్ భారత్ దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో పాటు పలు సూచనలు కూడా చేసింది. దేశంలో మొత్తంగా 110 మంది కరోనావైరస్ బారిన పడి చికిత్స పోందుతున్నట్లు కేంద్ర అరోగ్య శాఖ వివరించింది. ఈ వ్యాధిబారిన పడి మృతిచెందినవారి కుటుంబాలకు పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇద్దరు కరోనా వ్యాధి అనుమానితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు కూడా విదేశీ పర్యటనకు వెళ్లోచ్చిన వారేనని అధికారులు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు వారిద్దరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సనదిస్తున్నారు. అనుమానితుల రక్తనమూనాలు సేకరించి ఫూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. నివేదికలు వచ్చిన తరువాత వారికి వైరస్ సోకిందా లేదా అన్న స్ఫష్టత వెల్లడవుతుందని తెలిపారు. అనుమానితుల్లో ఒకరు నేపాల్ పర్యటనకు వెళ్లి రాగా, మరొకరు వియత్నాం వెళ్లి వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా,  ఆంద్రప్రదేశ్ లో ఇప్పటివరకు 79 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్‌ గా తేలిగా.. 65 మందికి నెగటివ్ గా తేలింది. మరో 13 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి వుందని తెలిపింది.

ఇటు తెలంగాణలోనూ కరోనాపై ప్రభుత్వం యుద్దాన్ని ప్రకటించిన రాష్ట్ర సర్కారు.. యుద్దప్రాతిపదికనే చర్యలను కూడా తీసుకుంటోంది. ఇందుకోసం '1895' చట్టాన్ని అమలులోకి తీసుకోచ్చింది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య ఇండియాలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం ప్రకారం, రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నైనా అధికారులు తమ అధీనంలోకి తీసుకుని అప్రకటిత కర్ప్యూ వాతావరణాన్ని విధించే అవకాశముంది. ఈ చట్టాన్ని సడలించేవరకు ఆయా ప్రాంతం పూర్తిగా గృహనిర్భంధంలోనే వుండాల్సివుంటుంది. కరోనా వ్యాధి బాధితులు అధికంగా ఉన్న చోట ఈ చట్టాన్ని అమలు చేసే అధికారాలు సంబంధిత ప్రాంత ఆఫీసర్లకు ఉంటుంది.

కాగా, ఫిబ్రవరి 10 తరువాత విదేశాల నుంచి సుమారు 6 వేల మంది వరకూ తెలంగాణకు వచ్చారు. వీరిని ఎటూ వెళ్లకుండా ఆదేశించామని వైద్యాధికారులు స్పష్టం చేసినా, కొందరు బయటకు వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే కరోనా వచ్చే అవకాశాలు ఉండటంతో, వ్యాధి లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసోలేషన్ లో ఉన్న వారిలో సుమారు 12 మంది రిపోర్టులు మాత్రమే రావాల్సి వున్నాయి. మొత్తం 60 మంది వరకూ ప్రస్తుతం క్వారంటైన్ స్థితిలో ఉన్నారు. వారిలో చాలా మంది రక్త నమూనాలను పరీక్షించిన అధికారులు, కరోనా నెగటివ్ గా తేల్చారు. కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారికి చికిత్సలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles