Coronavirus: Second death confirmed in India కరోనా వైరస్ డేంజర్ బెల్స్: భారత్ తో రెండు మరణం నమోదు

Second coronavirus linked death in india 68 year old woman dies in delhi

Coronavirus, covid-19, coronavirus in delhi,coronavirus update, Ram Manohar Lohia Hospital, Preeti Sudan, mohammad Hussain siddiqui, Fever, Kalaburgagi, Gulburga hospital staff, corporate hospital, Telangana, Gulburga, karnataka, politics

A 68-year-old woman who tested positive for coronavirus infection died in Delhi, announced Health Ministry and Delhi government officials today, said health secretary Preeti Sudan.

కరోనా వైరస్ డేంజర్ బెల్స్: భారత్ తో రెండు మరణం నమోదు

Posted: 03/14/2020 10:55 AM IST
Second coronavirus linked death in india 68 year old woman dies in delhi

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో మొత్తం 85 మందికి సోకిగా.. వృద్దులను మాత్రం బలిగొంటోంది. ఈ వ్యాధి బారిన పడి కర్నాటక కాలాబుర్గి ప్రాంతానికి చెందిన ఓ 68ఏళ్ల వృద్దుడు మరణించగా, తాజాగా మరో 68ఏళ్ల వృద్దురాలు మరణించింది. దీంతో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన ఢిల్లీకి చెందిన వృద్ద మహిళ మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ వెల్లడించారు.

ఆమె మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు పెరిగిందని భారత అరోగ్యశాఖ ప్రకటించింది. గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన కుమారిడి నుంచి అమెకు కరోనా వైరస్ సోకింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అమె అసుపత్రిలో చేరగా కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అమె కోడుకు కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడినా.. ఆయన కోలుకున్నాడని సమాచారం. కాగా, వృద్దురాలిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా అసుపత్రికి తరలించి.. అక్కడే ఐసోలేషన్ వార్డులో చికిత్సను అందించారు. ఈ నెల 9న అమె అరోగ్యం మరింతగా క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలోనూ అమె అనేక ఇబ్బందులు పడింది.

దీంతో అమెకు వెంటిలేటర్ సాయంతో శ్వాసను అందించిన వైద్యులు.. అమెకు చికిత్సను అందించారు. అయినా అమె శరీరం వైద్యానికి స్పందికపోవడం.. పరిస్థితి మరింత దిగజారడంతో గత రాత్రి అమె మృతి చెందారు. అయితే అమె దహనసంస్కారాలు కూడా ఎలా చేయాలన్న దానిపై కూడా వైద్యఆరోగ్యశాఖ అమె బంధువులకు పలు సూచనలు చేసింది. దీంతో దేశంలో రెండో కరోనా మృతి సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే రెండో మరణం సంభవించిన నేపథ్యంలో జాతీయ అరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాధి పట్లు అప్రమత్తంగా వుండాలని ఎటువంటి నిర్లక్ష్యం తగదని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles