US Declares a Coronavirus National Emergency కరోనా వైరస్: అగ్రాజ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ

Donald trump declares national emergency over coronavirus pandemic

Coronavirus outbreak, Trump administration, Donald Trump, Infectious diseases, Coronavirus, covid-19, US Health Emergency, coronavirus pandemic, coronavirus kills 41 in US, 41 coronavirus deaths in America, US politics

Donald Trump declared a national emergency to combat the coronavirus pandemic, freeing up $50bn in federal funding and promising a screening website and drive-by tests. The president was seeking to restore confidence after angering and worrying many with confusing and dismissive public remarks about the outbreak, which in the US has spread to 46 states with at least 1,920 cases and 41 deaths.

కరోనా ప్రభావం: అగ్రారాజ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

Posted: 03/14/2020 11:33 AM IST
Donald trump declares national emergency over coronavirus pandemic

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న దేశాలనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తీవ్రంగావుండటం.. స్థానిక ప్రజల్లో నెలకొన్న భయాందోళన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5436 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 1.50 లక్షల మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.

అమెరికాలోనూ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికాలో 1920 మంది కరోనావైరస్ బారిన పడ్డారని, కాగా 41 మంది మరణించారని అక్కడి వైద్య అధికారులు దృవీకరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్ ఎమర్జెన్సీ) విధించారు. అలాగే, నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిన్న వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను కరోనా బాధితులను కలుసుకున్నానని.. అయితే ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయించుకోలేదని చెప్పారు.

కాగా తాను కరోనావైరస్ పరీక్షలను చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను ట్రంప్ కలిశారు. తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు మాత్రం కరోనా సోకలేదని తేలింది. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండు గంటలపాటు బోల్పోనారోతో కలిసి ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం కలిసి భోజనం చేశామని, పక్కపక్కనే ఉన్నామని పేర్కొన్నారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని, కాబట్టి తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని ట్రంప్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles