Is there law and order in AP, asks high court అమరావతి భూముల్లో పేదలకు ఇళ్లస్థలాపై తీర్పు రిజర్వు

Ap high court reserves order on amaravati land allocation

YCP Activists, slogans, Pro Govt, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, Decision Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The AP high court said the state government was “making a mockery of the system” by deploying police to evict people from the assigned lands. Three member bench of headed by chief justice slammed the government of Andhra Pradesh and reserved the orders for allocating the house sites to the poor from the capital region

అమరావతి భూముల్లో పేదలకు ఇళ్లస్థలాపై తీర్పు రిజర్వు

Posted: 03/13/2020 01:46 PM IST
Ap high court reserves order on amaravati land allocation

ఏపీలో జరుగుతున్న పరిణమాలపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానంలో ప్రభుత్వం చెబుతున్న దానికి.. క్షేత్రస్థాయిలో అచరణలో జరుగుతున్న దానికి అసలు పొంతనలేదని అక్షేపించింది. రెవెన్యూ వ్యవహరాల్లో జరుగుతున్న తంతుపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. భూమి లేని నిరుపేదల పేరు చెప్పి గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని తీసుకుని ఇతర పేదలకు అసైన్డ్‌ చేయడం ఎందుకు? తమ భూములను లాక్కోవద్దని ఆందోళన చేస్తున్న ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెడతారా? మీ తీరు సరి కాదు’ అని స్పష్టం చేసింది.

ఇళ్ల స్థలాలకు భూమిని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూముల్ని అధికారులు బలవంతంగా తీసుకోవడాన్ని నిలువరించాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనంలో ఉంచుకున్న పట్టాలు లేని పేదలను ఖాళీ చేయించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ‘కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం-కేవీపీఎస్‌) ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్ గా పరిగణించి విచారణ జరుపింది.

‘తమకు అందిన లేఖతో జత చేసిన ఫొటోలను చూస్తుంటే బలవంత భూసమీకరణకు జేసీబీలు తెచ్చినట్లున్నారు. పక్కన కొట్టేసిన చెట్లున్నాయి. చెట్లు కొట్టేయడం నేరం. ఆ చర్య సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. అందుకు బాధ్యులైన అధికారులెవరో చెప్పండి. చర్యలకు ఆదేశిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏజీ శ్రీరాం బదులిస్తూ... భూముల్ని వెనక్కి తీసుకున్నందుకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం భూములను తీసుకోవచ్చని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎంత మందికి పరిహారం చెల్లించారు? తీసుకున్న భూములకు సంబంధించిన రికార్డులను మా ముందు ఉంచండి’ అని ఏజీకి తేల్చి చెప్పింది. విచారణను వాయిదా వేసింది.

విశాఖ జిల్లాలోని దొండపూడి గ్రామంలో రెవెన్యూ, పోలీసు అధికారుల తీరును త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. తమ వ్యవసాయ భూముల్లో రావికమతం తహసీల్దారు జోక్యం చేసుకోవడాన్ని నిలువరించాలని కోరుతూ 74 మంది హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం.. ‘పంటను ధ్వంసం చేస్తున్నట్లు ఫొటోల్లో ఉంది. పోలీసుల సహకారంతో భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. తీవ్రమైన నేరం జరిగితేనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు పోలీసులు అక్కడికి ఎందుకు కెళ్లారు. పోలీసుల తీరు ఇలా ఉంది కాబట్టే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాం’ అని డీజీపీ గౌతం సవాంగ్ ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలను ఇవ్వడం సరికాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. రైతుల నుంచి తీసుకున్న భూముల నుంచి పేదలకు ఇళ్ల కేటాయింపు సరికాదని వ్యాఖ్యానించింది. సీఆర్‌డీఏ చట్టంలో నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకుని మిగిలిన వాటిని విస్మరిస్తామనడం ఆమోదయోగ్యం కాదంది. భూమిని ఇష్టానుసారంగా కేటాయించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 107ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై  హైకోర్టు విచారణ జరిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles