Excise police and thief friendship exposed on CCTV.? దొంగలతో పోలీసుల దోస్తీ..? బయటపెట్టిన సీసీటీవీ.?

Excise police and thief friendship exposed on cctv

polling officials deny to give nomination papers to oppositions, nomination papers, ruling party activist ruckus, ruling party hurdles, ysrcp activists attack oppositions, local body elections, zptc elections, mptc elections, panchayat elections, YSRCP, BJP, TDP, opposition parties, Andhra pradesh, Politics

Excise police and thief friendship caught on CCTV in Guntur of Andhra Pradesh. A unknown person bought a liquor bottles secretly and kept then in the house of TDP party contestant and fled away, on the next day in early hours excise police made thier way to known spot and siezed the bottles.

ITEMVIDEOS: దొంగలతో పోలీసుల దోస్తీ..? బయటపెట్టిన సీసీటీవీ.?

Posted: 03/13/2020 05:05 PM IST
Excise police and thief friendship exposed on cctv

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మద్యం పంచితే నేరం అన్న చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల్లో ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకున్నా.. లోపాయికారిగా మాత్రం జరగకూడని పనులకు ఆజ్యం పోస్తోందన్న వాదన తెరపైకి వస్తోంది. ఈ ఎన్నికలలో ప్రత్యర్థిపార్టీల నేతలను నామినేషన్ల దాఖలు చేయకుండా అడ్డుకున్నారన్న అభియోగాలను ఎదుర్కోన్న అధికార పార్టీ.. ఆ అపవాదు నుంచి ఇంకా బయటపడే మార్గమే లేకుండా విమర్శలను ఎదుర్కొంటున్న వేళ.. కొత్త చట్టాన్ని కూడా తమకు అనుకూలంగా వినియోగం చేసుకుంటున్నారన్న అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి.

మద్యం దుకాణాలు ప్రభుత్వ పర్యవేక్షణలో నడుపుతున్నది ఇలాంటి చర్యలకు పాల్పడేందుకేనా అన్న అనుమానాలు కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎంతగా గొంతునొక్కొతే  అంతకుమించిన బలంతో మరో్ గొంతు లేస్తోందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు అసలు మరవద్దన్న సూచనలు కూడా ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకువస్తే.. దాన్ని పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలుపర్చేందుకు అధికార పార్టీ శ్రేణులు సన్నదం అవుతుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని అధికారపార్టీ శ్రేణులే తూట్లు పోడుస్తున్నారన్న అరోపణలు వినబడుతున్నాయి.

నూతన చట్టాన్ని పర్యవేక్షించే ఎక్సైజ్ పోలీసులతో లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారా.? లేక చేసేదంతా చేసి పోలీసులకు గుట్టుగా సమాచారం అందించారా.? లేక టెక్నాలజీ భారీగా పెరుగుతున్న క్రమంలో నిఘానేత్రాలు కూడా పహారా కాస్తున్నాయన్న విషయాన్ని మర్చపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చేసిన పని అటు ప్రభుత్వానికి, ఇటు ఎక్సైజ్ అధికారులకు అఫఖ్యాతి తీసుకువస్తోంది. ఈ అరోపణలను ఎదుర్కోవడం కన్నా ముందుగా దొంగచాటుగా మద్యం సీసాలను అర్థరాత్రి పూట తీసుకువచ్చిన.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇంటిపై పెట్టిన ఘనుడు ఎవరన్నది ముందుకు పోలీసులు గుర్తించాల్సిన అవశ్యకత ఏర్పడింది.

అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు టీడీపీ అభ్యర్ధి ఇంట్లోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగలా అడగులో అడుగులు వేసుకుంటూ మద్యం బాటిళ్లను తీసుకువచ్చి.. వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి పరారయ్యారు. ఇది జరిగింది సరిగ్గా అర్థరాత్రి 12.30 గంటలు దాటిన తరువాతే. అయితే ఉదయాన్నే ఎక్సైజ్ అధికారులు టీడీపీ అభ్యర్థి ఇంటికి చేరుకుని.. వాటర్ ట్యాంక్ ఎక్కడా? ఎన్ని ఫ్లోర్లు అంటూ ఆరా తీయడంపై పలు అనుమానాలు టీడీపీ అభ్యర్థి కుటంబసభ్యులతో పాటు స్థానికుల నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి.

పై అంతస్థులోని పెంట్ హౌజ్ లో ఉంటున్న అభ్యర్థి బంధువు కార్తీక్ ను అధికారులు వెంట తీసుకెళ్లి.. సరిగ్గా వాటర్ ట్యాంకు వద్దకెళ్లి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లు ముందగానే తెచ్చిపెట్టుకున్నారా.. అంటూ పోలీసులు సదరు యువకుడ్ని తమ వెంట తీసుకుని వెళ్లారు. అయితే ఇది కార్తీక్ చేసిన పనికాదని అనుమానంలో ఇంటి అవరణలోని సిసిటీవీ ఫూటేజీని పరిశీలిస్తే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు కర్చీఫ్ కట్టుకుని వచ్చి మద్యం సీసాలను మేడపై పెంట్ హౌజ్ వద్ద పెట్టివెళ్లిన దృష్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి.

అయినా అధికారులు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకోకుండా.. అభ్యర్థి బంధువును తీసుకెళ్లడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో నమోదైన వ్యక్తులను గుర్తించకుండా తమ ఇంట్లో వారిని బెదిరించడంపై కుటుంబ సభ్యులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎవరో చెప్పినట్టుగా రాత్రి తాము నిద్రపోయిన తరువాత జరిగిన ఘటనను ఉదయాన్నే ఇంట్లో వున్న తమకు కూడా సమాచారం తెలియకుండానే పోలీసులు ఎలా వచ్చారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మరికోందరు మద్యం బాటిళ్లు పెట్టిన దోంగ పోలీసులకు తెలిసే చేశాడా.? లేక చేసిన తరువాత వారికి సమాచారం అందించాడా.? అంటూ కూడా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles