Bank to auction TDP MLA properties గంటా శ్రీనివాసరావు విశాఖ ఆస్తుల వేలం.. 16నే ముహూర్తం..

Ganta srinivasa rao s assets for auction by indian bank

Bank Ready To Auction Ex Minister Ganta Srinivasa Rao Assets, Ex Minister Ganta Srinivasa Rao Assets, Ganta Srinivasa Rao vizag assets, Ganta Srinivasa Rao assets, Ganta Srinivasa Rao visakhapatnam assets, ganta srinivasaa rao,Assets, vizag assets, Indian Bank, Prathyusha company, Andhra pradesh, Politics

Indian bank has given a rude shock to former minister Ganta Srinivasa Rao. The bank has issued orders to auction the Ganta Srinivas Rao's assets for failing the pay the debts of amount Rs.142 crore. The auction is scheduled to be held on March 16.

గంటా శ్రీనివాసరావు విశాఖ ఆస్తుల వేలం.. 16నే ముహూర్తం..

Posted: 03/11/2020 01:43 PM IST
Ganta srinivasa rao s assets for auction by indian bank

టీడీపీ విశాఖ ఉత్తరం ఎమ్మోల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాకిచ్చింది. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం వేసేందుకు ముహూర్తాన్ని ప్రకటించింది. మాజీ మంత్రి గంటా ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఇవాళ పలు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. రుణం బకాయిలను తీర్చుకునే క్రమంలో భాగంగా తనఖా పెట్టిన ఆస్తులను వచ్చే నెల అనగా ఏప్రిల్ 16న ఆస్తుల ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనల్లో పేర్కోంది. వేలంలో పాల్గొనేందుకు ఈ నెల 15 వరకు ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించింది.

ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 15 లోపు నియమనిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. గంటాకు సంబంధించిన ప్రత్యూష కంపెనీ.. ఇండియన్ బ్యాంకులో రూ.141.68కోట్లు రుణం తీసుకుంది.. ఆ అప్పు వడ్డీతో సహా రూ.221 కోట్లకు చేరింది. ప్రత్యూష కంపెనీకి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్నారు. రుణం ఎగవేయడంతో ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాసరావుతో పాటూ మరో ఏడుగురు డైరెక్టర్ల ఆస్తుల వేలానిక రంగం సిద్ధం సిద్ధమైంది.

గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా ఈ రుణానికి సంబంధించినవి కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వేలానికి రానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటాకు పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం అంశంపై తెరపైకి వచ్చింది. దీనిపై గంటా కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆస్తుల వేలం తెరపైకి వచ్చింది. వేలానికి సంబంధించి విషయాలపై గంటా శ్రీనివాసరావు స్పందించాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles