ABVP activists lathi-charged in Hyderabad ‘ఛలో అసెంబ్లీ’కి విద్యార్థి సంఘాల పిలుపు.. విరిగిన లాఠీ..

Tension at telangana assembly protesting students lathi charged

lathi charge at Telangana Assembly, ABVP students lathi charged, PDSU students lathi charged, Telangana Assembly, ABVP, PDSU students, fee reimbursement, scholarships, Osmania University, Nizam College, ‘Chalo Assembly’ anti-education policies, Protests, Hyderabad, Telangana, Politics

Tension prevailed at the Telangana Assembly after hundreds of ABVP and PDSU students stormed the State Assembly demanding that the government immediately release pending fee reimbursement and scholarships.

‘ఛలో అసెంబ్లీ’కి విద్యార్థి సంఘాల పిలుపు.. విరిగిన లాఠీ..

Posted: 03/11/2020 01:12 PM IST
Tension at telangana assembly protesting students lathi charged

ఛలో అసెంబ్లీకి విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి చేరుకున్న విద్యార్థులపై పోటీసులు టాఠీలను ఝుళిపించారు. ఏళ్లుగా పెండింగులో వున్న ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటు స్కాలర్ షిప్ లను తక్షణం విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ, పీడిఎస్యూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా భారీ పోలీసు పహారాను చేధించుకుని విద్యార్థులు అసెంబ్లీ గేటు వద్దకు చోచ్చుకెళ్లారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు  వెంటనే వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles