no-stock in wine shops of Andhra Pradesh మద్యం దుకాణాలకు మందుబాబుల పరుగులు

No stock board appear in front of wine shops in andhra pradesh

alcohol, wine shops, andhra pradesh, 17 days shut down, wine shops close for 17 days, liquor shops close, no alcohol shops in AP, Coronavirus, covid-19, local body elections, liquor shops, no stock board, alcohol, panchayat elections, MPTC ZPTC elections, Andhra pradesh, politics

boozes in Andhra pradesh run to Liquor shops to get some stock as wineshops in the state are being shut down for at least 17 days as elections of local bodies are yet to start. boozers stand in big queues to get their stock

మద్యం దుకాణాలకు మందుబాబుల పరుగులు.. ‘‘నో-స్టాక్’’ బోర్డులు

Posted: 03/11/2020 03:22 PM IST
No stock board appear in front of wine shops in andhra pradesh

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న క్రమంలో మద్యం సేవించడం వల్ల దాని బారిన పడకుండా వుండవచ్చునన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులుతీరుతున్నారు. అయితే ఈ విషయం సత్యదూరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినా.. ఇక పెడచెవిన పెడుతున్న మందుబాబు.. తమకు కావాల్సింది వినిపించిందని, ఇక వినపించకూడదని ఎంత గట్టిగా అరిచి చెప్పినా చెవిటివాడి ముందు శంఖం వూదినట్లే అన్నట్లు వ్యవహరిస్తుండటం వీరి సహజ లక్షణం.

ఈ తరుణంలో ఏకంగా మద్యం దుకాణాలకు తాళాలు పడుతున్నాయి.. ఇకపై మద్యం లభించదు అన్న వార్త వింటే.. మందుబాబులు ఆ వార్తలు విన్నవెన్నంటనే పరుగులు పెడుతున్నారు. ఎంత లభ్యమైంతే అంత.. బ్రాండులతో సంబంధం లేకుండా.. ఏది దొరికానా తీసుకుంటున్నారు. కొనుగోళ్లలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా మద్యం దుకాణాల్లో నిల్వవున్న స్టాకు మొత్తం గంటల వ్యవధిలో అమ్ముడైపోయింది. దీంతో మద్యం దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.

అసలెందుకు తాళాలు పడుతున్నాయ్.? మధ్య నిషేధం ఏమీ లేదే.? అంటే.. ఒక్క వార్త మాత్రం ఇంతటి సంచలనాన్ని క్రియేట్ చేసింది. స్థానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకంగా 17 రోజుల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలియడటంతో మందుబాబులు తమ మజీలిన వెతుక్కుంటూ మద్యం దుకాణాల వద్దకే పరుగులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు అంటే 17 రోజులపాటు మద్యం షాపులు మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. అంతే.. వార్త తెలిసిన వెంటనే మద్యం బాబులు ఎక్కడి పనులు అక్కడే ఆపేసి దుకాణాల వద్దకు పరుగులు పెట్టారు.

17 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసుకునేందుకు పోటీలు పడ్డారు. గంటల తరబడి మద్యం షాపుల ముందు క్యూలో ఓపిగ్గా నిల్చున్నారు.నిజానికి ఒకరికి మూడు సీసాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధన ఉండడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. కొందరు తమ బంధువులు, స్నేహితులను కూడా క్యూలలో నిలబెట్టి మరీ మద్యాన్ని సంపాదించారు. మద్యం ప్రియులు ఎగబడడంతో మధ్యాహ్నానికే చాలా షాపులు నో స్టాక్ బోర్డు తగిలించాయి. కాగా, దుకాణాల మూసివేత విషయమై అధికారుల నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles