Corona virus hits chicken sales కరోనా భయం.. చికెన్ @ 40 రూపాయలకే కేజీ

Demand for tank fish soars as covid 19 hits chicken sales

chicken at Rs 40, chicken @ Rs 40 per kg, coronavirus scare, covid-19 scare, coronavirus rumours, coronavirus, COVID-19, decline in sales of chicken, chicken sales, poultry markets, poultry industry, andhra pradesh, Telangana

People are swearing off chicken, worried that they might contract the dreaded coronavirus (COVID-19), leading to a sharp decline in sales of chicken at poultry markets. Officials of the Animal Husbandry Department have repeatedly given assurances However, these seem to have had no effect.

కరోనా భయం: చికెన్ ప్రియులు విన్నారా..కేజీ @ రూ.40

Posted: 03/11/2020 12:11 PM IST
Demand for tank fish soars as covid 19 hits chicken sales

కరోనా వైరస్ ప్రభావం మనుషులపై ఎంతటి ప్రభావం చూపుతుందో తెలియదు కానీ.. పౌల్ట్రీ ఇండస్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏ వైరస్ వచ్చినా.. అది ఫ్లూ అయినా, బర్డ్ ప్లూ అయినా.. లేక కోళ్లకు వచ్చే సాధారణ వ్యాధులైనా.. మిగతా అహారా రంగాలపై దాని ప్రభావం ఏమో కానీ.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ఇష్టమైన ఆహారంగా మారిన చికెన్ పై ఈ ప్రభావాలు వెనువెంటనే చూపుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కూడా కోడి మాంసంపై దారుణంగా పడుతోంది.

ఈ రంగాన్ని నమ్ముకుని పుంజుకుంటున్న తరుణంలో మరోమారు వ్యాపారులను కుబేరులను నుంచి కుచేలుడిని చేసింది. అటు ప్రభుత్వాలు, ఇటు మాంసాహార హోటళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కొంత పరిధిలో మాత్రమే ఫలితాలను ఇస్తున్నాయి. ఫలితంగా చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. తీవ్ర నష్టాలను భరించైనా ఉన్న వాటిని అయినకాడికి అమ్ముకునేందుకు వ్యాపారులు ప్రయత్నాలు సాగిస్తునే వున్నారు. అందులోభాగంగా తాము కొన్నధరలో ఎంతో కొంత వచ్చినా చాలునని భావిస్తున్నారు.

ఈ క్రమంలో మంసాహార ప్రియులు ధర అధికమైనా.. మాంసం కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారు. ఇక అనేకులు మాత్రం చేపల వైపు అకర్షితులవుతున్నారు. సాధారణంగా రవ్వలు, బొచ్చాలు వంటి చేపల ధరలు కిలో వంద రూపాయల లోపే వుండగా, ప్రజల నుంచి ఒక్కసారిగా వస్తున్న డిమాండ్ నేపథ్యంతో మత్య్సరంగం కళకళలాడుతోంది. దీంతో కిలో రవ్వలు, బొచ్చాలు కిలో నూటయాభై రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇక మత్తలు, కోరమీనులు, రోయ్యాలకు ధరలకు కూడా రెక్కలు వచ్చేశాయి.

ఇక నిత్యం జనసంద్రంతో కిటకిటలాడే చికెన్ దుకాణాలు మాత్రం గత కొన్ని రోజులుగా వెలవెలబోతున్నాయి. ఉన్న కోళ్లను కూడా విక్రయించుకోలేకపోతున్నారు. వాటికి దాణా ఖర్చు కూడా తామే భరించాల్సి వస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము కోన్న ధరలను పక్కన బెడితే వున్న కోళ్లకు దాణా ఖర్చు వచ్చినా ఫర్వాలేదని వాపోతున్నారు వ్యాపారులు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఓ దుకాణ యజమాని కిలో కోడి మాంసాన్ని రూ.40కే విక్రయిస్తానంటూ బోర్డు పెట్టారు. ఆయనలాగే చాలాచోట్ల వ్యాపారులు ధరను భారీగా తగ్గించి విక్రయిస్తున్నారు. నష్టాలను పంటి బిగువన భరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles