High Court serious on govt over Coronavirus కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

High court makes serious comments on telangana government over coronavirus coronavirus news

Coronavirus, HIgh Court, High Court directions, medicine, masks, covid-19 patients, Coronavirus news, Coronavirus new case, Coronavirus cases, Coronavirus Hyderabad, Coronavirus latest, Coronavirus in Raheja Mindspace, Coronavirus latest updates, Coronavirus Case in Raheja Mindspace, remedy for Coronavirus, covid-19, Hyderabad, Telangana, Health

Telangana High Court made severe comments on Telangana government over Coronavirus in the state. After hearing a PIL against Coronavirus in the state, the HC expressed dismay over the government officials work to fight against Coronavirus. The High Court ordered the Telangana government to issue free medicines and masks to the people.

కరోనా వైరస్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

Posted: 03/05/2020 04:28 PM IST
High court makes serious comments on telangana government over coronavirus coronavirus news

యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించడంతో దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తలంటిన న్యాయస్థానం.. కరోనా వైరస్ పై తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యాధి వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది.

కరోనా నివారణపై ప్రభుత్వం తీసుకన్న చర్యలపై దాఖలైన పిటిషన్ పై వివరణ ఇవ్వాలంటూ కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ప్రజల కోసం ఫ్రీగా మాస్కులు, మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ పాలన సామాన్యులను పరిగణ తీసుకుని జరగాలని.. ఆ విధంగానే వ్యాధి వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవాలని అదేశించింది.

కాగా, మురికివాడల్లో చేతులు కడుక్కోవడానికి పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నారా? లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సభలు, సమావేశాలకు పోలీసులు ఆలోచించి అనుమతి ఇవ్వాలని సూచించింది. లాయర్లు కూడా మాస్కులు ధరించి కోర్టుకు రావాలని కోరింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇదిలావుండగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యలను నివేదిక రూపంలో ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  covid-19 positvie  HIgh Court  High Court directions  medicine  masks  covid-19  Hyderbad  Telangana  

Other Articles