దేశరాజధాని ఢిల్లీలోని పుర వీధుల్లో కదులుతున్న బస్సులో ఓ అమాయక అడపడచుపై దారుణఘాతుకం జరిగి ఏడేళ్లు కావస్తున్నా ఇంకా ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగలేదు. యావత్ దేశాన్ని కదిలించిన ఈ హత్యాచార కాండపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు పెల్లుబిక్కిన క్రమంలో దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు న్యాయం కోసం వేచిచూస్తున్న బాధితురాలి కుటుంబసభ్యులకు అండగా నిలబడ్డాయి. అయితే దోషుల తరుపు న్యాయవాదులు మాత్రం ఈ కేసులో బాధితురాలికి న్యాయం దక్కకుండా.. ఈ కేసులో జాప్యాల మీద జాప్యాలు జరిగేలా న్యాయరంగంలోని లోసుగులకు పనిపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో మూడు పర్యాయాలు ఢిల్లీలోని పటియాల కోర్టు విడుదల చేసిన డెత్ వారెంట్.. వాయిదా పడటంతో.. ఈ సారి దోషులకు శిక్షను విధించే డెత్ వారెంట్.. మరణశిక్షను అమలుపర్చేదిగా వుండాలే కానీ.. వాయిదా పడేది కాకూడదని బాధితురాలి తల్లి ఆశాధేవి న్యాయస్థానాన్ని ఇటీవల న్యాయస్థానం డెత్ వారెంట్ పై స్టే విధించిన సందర్భంలో కోరారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని పటియాల కోర్టు నిర్భయ హత్యాచార కేసులో డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20 శుక్రవారం రోజున దోషులకు ఉరి శిక్ష విధించాలని న్యాయస్థానం తాజా అదేశాలను జారీ చేసింది.
ఇదివరకే ఈ కేసులో నలుగురు దోషులు అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. వెనువెంటనే రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ పెట్టుకున్నాడు. కాగా మరోమారు రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్ ను దోషి పవన్ సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూపిటీషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఇదే తరహాలో వినయ్ శర్మ కూడా రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్ పై.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేసినా.. అందులో కొత్తదనమేమీ లేదని న్యాయస్థానం కొట్టివేసింది. మరి నిర్భయ కేసులో తాజాగా జారీ చేసిన డెత్ వారెంట్ చిట్టచివరిదవుతుందా.? లేదా.. అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more