Nirbhaya Convict Pawan Gupta Files Curative petition in SC ‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

Nirbhaya convict pawan gupta files curative petition in supreme court

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Nirbhaya convict Pawan Gupta filed a curative petition in the Supreme Court of India on Friday. He is among the four convicts to be executed on March 3 of this year.

‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

Posted: 02/28/2020 05:56 PM IST
Nirbhaya convict pawan gupta files curative petition in supreme court

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా మరణ శిక్ష విధించాలని ఉద్దేశించిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేయడంతో సందేహాలు వ్యక్తం అవుతుండగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపర హక్కులను వినియోగించుకోని దోషి పవన్ గుప్తా తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించాడు.

నిర్భయ కేసులోని దోషుల్లో అందరికన్నా పిన్నవయస్కుడైన పవన్ గుప్తా.. ఇవాళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్యూరేటివ్ పిటీషన్ ను దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పిటీషన్ లో పేర్కోన్న పవన్ గుప్తా.. ఢిల్లీలోని పాటియాల న్యాయస్థానం విధించిన డెత్ వారెంట్ పై కూడా స్టే ఇవ్వాలని పిటీషన్ లో కోరాడు. పవన్ గుప్తా తరపున ఆయన న్యాయవాది ఏపీ సింగ్ ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. దీంతో దోషులకు మార్చి 3న మరణశిక్ష అమలు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇక ఈ కేసులో పవన్ గుప్తా దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం స్వీకరించింది. దీనిపై విచారణ జరిగే వరకు దోషులకు శిక్షను అమలు చేయడానికి వీలుండదు. కాగా, దీని తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ కేసులో దోషులైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), వినయ్‌ కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31) ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడం.. తిరస్కరణకు గురవ్వడం జరిగింది. దీన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌, వినయ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles